ఆటోలకు కలర్ కోడ్.. ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం!

73

దిశ, ఫీచర్స్: యూపీలోని నొయిడా సిటీలో చట్టవిరుద్ధమైన పనులు, క్రిమినల్స్ యాక్టివిటీస్‌ను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి పూనుకున్నారు. ఇటీవల కాలంలో నొయిడాలో వెలుగుచూసిన కొన్ని కేసులను పరిశీలిస్తే చట్టవిరుద్ధ పనులు చేసే వారికి అక్కడి ఆటోరిక్షావాలాలు తోడ్పడుతున్నట్లు వెల్లడైంది. దీంతో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు వీలుగా ట్రాఫిక్ పోలీసులు కలర్ కోడ్‌ను తీసుకొస్తున్నారు. తద్వారా ముందే సూచించిన రూట్లలో కాకుండా ఇతర రూట్లకు వెళ్లే ఆటోరిక్షావాలాలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఈ కలర్ కోడింగ్ వల్ల పబ్లిక్‌కు హెల్ప్ అవడంతో పాటు ట్రాఫిక్, క్రిమినల్ యాక్టివిటీస్ తగ్గే అవకాశముందని పోలీసు అధికారులు చెప్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అతిపెద్ద సబ్ అర్బన్ డిస్ట్రిక్ట్ గౌతం బుద్ధ్ నగర్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్.. నొయిడా సిటీలోని ఆటోరిక్షాలకు కలర్ కోడ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం డిస్ట్రిక్ట్‌లోని వెహికల్స్‌కు సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తున్నామని, ఇప్పటి వరకు 70 వెహికల్స్ గుర్తించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) గణేశ్ సాహ వెల్లడించారు. సిటీలోని ఒక్కో ఏరియాకు ఒక్కో కలర్ కోడ్ ఇవ్వనున్నట్లు, తద్వారా ఏ నెంబర్ కోడ్ ఎటు వైపునకు(రూట్) వెళ్తుందో ఈజీగా తెలుసుకోవచ్చునని వివరించారు. ప్రజలు తమ ఏరియాకు ఏ కలర్ కోడ్ ఆటో వెళ్తుందో అది మాత్రమే ఎక్కుతారని, ఇక ఆటోవాలాలు ఒక ఏరియా వారు ఇంకో ఏరియాకు రాబోరని, తద్వారా ట్రాఫిక్ తగ్గుతుందని డీసీపీ తెలిపారు. ఈ విధానం ద్వారా క్రిమినల్స్ యాక్టివిటీస్‌పై నిఘా పెడతామని, అయితే సమగ్రంగా ఈ సిస్టమ్ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టొచ్చని చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..