మళ్లీ జోరు పెంచిన స్టాక్ మార్కెట్లు

by  |
nifty
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి లాభాల దూకుడును పెంచాయి. అంతకుముందు రోజు లాభాల స్వీకరణతో చతికిల పడ్డ సూచీలు గురువారం తిరిగి పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల జోరు పెరగడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. అంతేకాకుండా కీలక రంగాల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు కొత్త గరిష్ఠాలను అందుకున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 514.33 పాయింట్లు ఎగసి 57,852 వద్ద ముగియగా, నిఫ్టీ 157.90 పాయింట్లు లాభపడి 17,234 వద్ద ముగిసింది.

నిఫ్టీలో కన్జ్యూమార్ డ్యూరబుల్స్ దాదాపు 2 శాతం పుంజుకోగా, రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు బలపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్, ఆటో రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఆల్ట్రా సిమెంట్, డా. రెడ్డీస్, నెస్లె ఇండియా, కోటక్ బ్యాంక్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఎన్‌టీపీసీ షేర్లు అధిక లాభాలను సాధించగా, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.05 వద్ద ఉంది.


Next Story

Most Viewed