- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో కొత్తగా 3,82,315 కరోనా కేసులు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా మరో 3.82 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవలే నాలుగు లక్షలకు చేరిన కొత్త కేసులు రెండు మూడు రోజులుగా దానికి చేరువగానే రిపోర్ట్ అవుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే దేశంలో 3,82,315 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, 3,780 మంది పేషెంట్లు కన్నుమూశారు. మొత్తం కేసులు 2,06,65,148కు చేరగా, మరణాలు 2,26,188కు పెరిగాయి. కాగా, మంగళవారం డిశ్చార్జీలూ భారీగా ఉండటం కాస్త ఉపశమనిచ్చే విషయంగా ఉన్నది. 24 […]</p>

X
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా మరో 3.82 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవలే నాలుగు లక్షలకు చేరిన కొత్త కేసులు రెండు మూడు రోజులుగా దానికి చేరువగానే రిపోర్ట్ అవుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే దేశంలో 3,82,315 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, 3,780 మంది పేషెంట్లు కన్నుమూశారు. మొత్తం కేసులు 2,06,65,148కు చేరగా, మరణాలు 2,26,188కు పెరిగాయి. కాగా, మంగళవారం డిశ్చార్జీలూ భారీగా ఉండటం కాస్త ఉపశమనిచ్చే విషయంగా ఉన్నది. 24 గంటల్లో 3,38,439 మంది రికవరీ రికవరీ అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 1,69,51,731కు చేరాయి. అయినప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య భారీగానే ఉన్నది. బుధవారం ఉదయానికి దేశంలో 34,87,229 క్రియాశీలక కేసులున్నట్టు కేంద్రం పేర్కొంది.
Next Story






