ఆ జాతిలో కూడా ఆగని లైంగిక వేధింపులు.. మేల్స్‌పై దాడిచేస్తున్న ఫిమేల్స్

by  |
ఆ జాతిలో కూడా ఆగని లైంగిక వేధింపులు.. మేల్స్‌పై దాడిచేస్తున్న ఫిమేల్స్
X

దిశ, ఫీచర్స్: సొసైటీలో మహిళలు అనేక చోట్ల, అనేక విధాలుగా వేధింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అలాంటి వారికి ధైర్యంగా బుద్ధి చెప్పగలిగే ధైర్యం కొందరికే ఉంటుండగా.. మరికొన్నిసార్లు పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడంతో హరాస్‌మెంట్‌కు పాల్పడే మేల్స్‌ను శిక్షిస్తుంటారు. కాగా సముద్ర జీవుల్లోనూ ప్రస్తుతం ఇదే తరహా విధానం కొనసాగుతుందనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. ఫిమేల్ ఆక్టోపస్‌లు హరాస్‌మెంట్‌కు గురైనట్లు భావిస్తే, మేల్స్‌పై వస్తువులను విసిరేస్తాయని తాజాగా వెల్లడైంది. ఈ సమాచారం నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుండగా.. వేధింపుల సమస్య అన్ని జాతుల్లోనూ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

కొత్త అధ్యయనం ప్రకారం.. ఎనిమిది అవయవాల జీవులకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ బిహేవియరల్ అంశాన్ని పరిశోధకులు పరిశీలించారు. మేల్ ఆక్టోపస్‌లు ఫిమేల్స్‌తో మీటింగ్ కోసం ప్రయత్నించినపుడు.. వాటిపై ఫిమేల్స్ చిన్న చిన్న రాళ్లు, ఇతర పుల్లలను విసిరేస్తాయని కనుగొన్నారు. ఈ మేరకు ‘ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్ : డెబ్రిస్ థ్రోయింగ్ బై వైల్డ్ ఆక్టోపసెస్’ అనే పేరుగల ప్రీప్రింటెడ్ రీసెర్చ్ పేపర్.. సముద్ర జీవులకు సంబంధించిన వివిధ అంశాలను వెల్లడించింది. వస్తువులు విసిరేయడాన్ని ‘జంతువుల్లో అసాధారణ ప్రవర్తన’గా పేర్కొన్న రీసెర్చర్స్.. వీటిని ‘కొన్నిసార్లు విలక్షణమైన మానవునిగా చూడవచ్చు’ అని నొక్కిచెప్పారు. ఏదేమైనా ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని వైల్డ్ ఆక్టోపస్‌లను నిశితంగా గమనిస్తున్నప్పుడు వాటిలో ఇలాంటి ప్రవర్తన చాలా సాధారణంగా ఉందని కనుగొన్నారు. సముద్రపు జీవులు తమ చేతుల ద్వారానే షెల్స్, సిల్ట్, ఆల్గేలను విసిరేస్తాయని గుర్తించారు. ఇందులో కొన్నింటికి ఒకే జాతికి చెందిన స్థిర లక్ష్యాలు కలిగిఉండగా, అవి మరింత శక్తివంతంగా ఉన్నట్లు తెలుసుకున్నారు.

ఆక్టోపస్‌ల అధ్యయనం కోసం పరిశోధకులు.. వాటి ప్రవర్తనను కొన్నేళ్లుగా కెమెరాలో బంధించారు. 2016లో రికార్డు చేసిన ఒక ఉదాహరణలో, ఆడ ఆక్టోపస్.. తనతో జతకట్టడానికి ప్రయత్నిస్తున్న మగ ఆక్టోపస్‌లపై సిల్ట్ విసురుతున్నట్లు కనిపించింది. అది పదిసార్లు సిల్ట్ విసరగా.. ఐదుసార్లు టార్గెట్‌ను రీచ్ అయిందని న్యూస్‌వీక్ ఒక నివేదికలో పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే ఫిమేల్స్ ఇలాంటి చర్యలకు పాల్పడతాయని ఈ సీక్వెన్స్ చూశాకే విశ్వసించిననట్లు పరిశోధకుల్లో ఒకరైన పీటర్ గాడ్‌ఫ్రే-స్మిత్ తెలిపారు. అయితే కొన్నిసార్లు మేల్ ఆక్టోపస్‌లు రక్షణ కోసం కాళ్లను పైకిలేపినట్లు నివేదించిన హెరాల్డ్ సన్.. అవి ప్రతీకారం తీర్చుకోలేదని, ఎలాంటి తగాదాలకు ప్రేరేపించలేదని పేర్కొంది.


Next Story

Most Viewed