సక్సెస్ @ సెక్సీ ‘బాంబే బేగమ్స్’

by  |
bombay begums
X

దిశ, సినిమా: ‘నీ శరీరం నీది.. దాన్ని నువ్వు ఎలాగైనా వాడుకోవచ్చు. పెళ్లితో కట్టిపడేశారని అక్కడితో ఆగిపోవడమా, కొత్త బంధాలు వెతుక్కోవడమా? అన్నది నీ ఇష్టం.. గొప్ప ప్రేమ, కంఫర్ట్ దొరికిన చోటే ఉండాలనుకోవడంలో తప్పులేదు. నీ లైఫ్ పార్ట్‌నర్ దగ్గర నువ్వు సంతృప్తిగా లేకపోతే నిర్భయంగా మరోదారి ఎంచుకోవచ్చు. నీ లైఫ్ నీది..నీ ఎంజాయ్‌మెంట్ నీది. కానీ మరో మగాడి స్పర్శ తప్పుగా అనిపిస్తే, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే మాత్రం ఎదురుతిరగాల్సిన అవసరముంది. ఎంతటివాడైనా సరే..నో చెప్పాల్సిన హక్కు నీకుంది. గుర్తుంచుకో..సొసైటీ అనేది నీ బాడీ, చాయిసెస్ గురించి ఎప్పుడూ ఆలోచించదు..బి వారియర్’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ ‘బాంబే బేగమ్స్’.

కొందరు మహిళలు రూల్ చేసేందుకు పుడతారు వారిని క్వీన్స్ అంటాం. కొందరు క్వీన్స్‌గా ఎదిగేందుకు పోరాటం చేస్తారు. వీళ్లు అస్పైరర్స్. మరి కొందరు నవ్వుతూ బాధను దూరంగా పెట్టాలనుకుంటారు వీళ్లు సర్వైవర్స్. మరి ‘రియల్ క్వీన్స్ ఆఫ్ బాంబే’ ఎవరో తెలుసా? డ్రీమ్ సిటీలో తమకు నచ్చినట్లుగా బతికేందుకు దారులు ఎన్నుకుని సక్సెస్ అయ్యేవారు. వాళ్లే ‘బాంబే బేగమ్స్’. రాణి(పూజా భట్), లిల్లీ(అమృతా సుభాష్), షాయి(ఆధ్యా ఆనంద్), ఫాతిమా(షహానా గోస్వామి), ఆయేషా(ఫ్లబితా). ఈ ఐదుగురు మహిళల లవ్, పెయిన్, సెక్సువల్ ఎక్స్‌ప్లోరేషన్, సెల్ఫ్ లవ్‌ ‘బాంబే బేగమ్స్’ కథ. ఈ సిరీస్‌ చూస్తే చెడిపోయేందుకు ఎన్ని దారులు వెతుక్కోవచ్చో, మంచిని చూసి మార్పు చెందేందుకు కూడా అన్నే దారులు వెతకొచ్చు. ఆరు ఎపిసోడ్లతో కూడిన సిరీస్ టూ మచ్ ఆఫ్ సెక్స్ సీన్స్, వల్గారిటీతో నిండిపోయి ఉంది. అప్పుడప్పుడు అలా పలకరించి వెళ్లే మెసేజ్, సిరీస్‌లో బ్యాడ్ మాత్రమే లేదు గుడ్ కంటెంట్ కూడా ఉందని అలర్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా గుడ్ సిరీస్ అయినా ఫైనల్ ఎపిసోడ్ లేదంటే ఐదు గంటల టైమ్ వేస్ట్ అని చెప్పొచ్చు. మరీ అన్ని గంటల పాటు సిరీస్ చూసి ఫైనల్ ఎపిసోడ్‌లో జ్ఞానోదయం పొందేకన్న సిరీస్ చూడకుండా ఉండటమే బెటర్. అయితే బోల్డ్ కంటెంట్ కావాలనుకున్న ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ శాటిస్‌ఫై అవడం మాత్రం పక్కా.

రాణి (పూజా భట్):

ప్రస్తుతం రాయల్ బ్యాంక్ సీఈఓగా ఉన్న రాణిగా పూజా భట్ యాక్షన్ అదరగొట్టేసింది. అందరి ముందు హుందాగా కనిపిస్తూనే భర్తతో కాకుండా మరో వ్యక్తితో ఇల్లీగల్ రిలేషన్‌ షిప్‌లో ఉన్న బిజినెస్ ఉమన్‌గా సూపర్‌గా యాక్ట్ చేసింది. కానీ యాక్టింగ్, స్క్రిప్ట్ కథ కన్న కూడా ఈ క్యారెక్టర్‌ ద్వారా లిప్ లాక్, లేట్ వయసులోనూ సెక్సువల్ లైఫ్‌ను ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చనేది చూపించారు. ఈ క్యారెక్టర్‌తోనే అన్ని క్యారెక్టర్స్ ముడిపడి ఉంటాయి. షాయి, షాయి బ్రదర్‌కి స్టెప్ మదర్‌గా కనిపించే పూజ వారి నుంచి నిజమైన ప్రేమను పొందేందుకు ఎంత తహతహలాడుతుందనేది చూపించారు. కొడుకును ఓ క్రైమ్ నుంచి కాపాడేందుకు, కూతురికి తన లాంటి చీకటి జీవితం రాకూడదని చెప్పేందుకు ఎంతగా ప్రయత్నిస్తుందనేది ఫస్ట్ కాస్త ఆడ్‌గా మొదలైన ఫైనల్‌గా ఎమోషనల్‌గా ముగుస్తూ కన్నీళ్లు తెప్పిస్తుంది.

లిల్లీ(అమృతా సుభాష్):

క్లబ్ డ్యాన్సర్ లిల్లీగా, ప్రాస్టిట్యూట్‌గా కనిపించిన అమృతా సుభాష్..తన కొడుకును కార్పొరేట్ స్కూల్లో చదివించి, ఇంజినీర్‌ను చేయాలని కోరుకునే పాత్రలో జీవించేసింది. కానీ క్లబ్ డ్యాన్సర్ అయిన తన కొడుకు తమ పాఠశాలలో చదివితే స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుందని నో చెప్తుంటాయి యాజమాన్యాలు. ఈ క్రమంలో తనతో ఫస్ట్ సెక్సువల్ ఎక్స్‌పీరియన్స్ పొందేందుకు వచ్చిన రాణి స్టెప్ సన్‌, తన కొడుకుకు యాక్సిడెంట్ చేస్తాడు. ఈ రెండు మ్యాటర్స్‌తో రాణిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగే లిల్లీ..ఎలాగైనా ఓ కంపెనీని పెట్టాలనుకుంటుంది. తద్వారా సమాజంలో రెస్పెక్ట్ పొంది తద్వారా స్కూల్‌లో కొడుకుకు సీట్ వచ్చేలా చేయాలనుకుంటుంది. కానీ ఓ లోకల్ లీడర్‌తో సెక్స్‌కు నో చెప్పడంతో తను ఆమె ప్రయత్నాలను అడ్డుకుంటాడు. ఈ క్రమంలో తనను లవ్ చేస్తున్నానని, కొడుకుతో పాటు తనను దుబాయ్‌కు తీసుకెళ్తానని మాయమాటలు చెప్తాడు. దీంతో తమను దుబాయ్‌కు పంపించాలని రాణిని మరోసారి బ్లాక్ మెయిల్ చేస్తుంది. కానీ అప్పుడే దుబాయ్‌కు తీసుకువెళ్తానన్న వ్యక్తికి మరో ఫ్యామిలీ ఉందని రియలైజ్ అవుతుంది. తన మీద మోజు తీర్చుకునేందుకే ఇన్నాళ్లు తనతో పాటు ఉన్నాడని తెలుసుకుని మళ్లీ రాణినే ఆశ్రయిస్తుంది. కాగా రాణి పాత్రలో హై కార్పొరేట్ కల్చర్‌లో సెక్స్ రిలేషన్ షిప్ గురించి వివరించిన మేకర్స్..లిల్లీ క్యారెక్టర్ ద్వారా మిడిల్ క్లాస్ సెక్సిజం గురించి చూపించినట్లుగా ఉంటుంది. ఎట్ ఏ టైం తనకు ఎలాగూ మర్యాద లేదు కదా కనీసం తన కొడుకైనా సొసైటీలో సగర్వంగా బతకాలనే తల్లిగా పాకులాడే లిల్లీ పాత్ర కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పిస్తుంది.

ఫాతిమా(షహానా గోస్వామి):

మెచ్యూర్ అండ్ డిసిప్లైన్డ్ క్యారెక్టర్ ఫాతిమాగా షహానా గోస్వామి కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. అమ్మగా మారేందుకు లాస్ట్ చాన్స్ ఉన్న తను రాయల్ బ్యాంక్‌లో తన కన్న తక్కువ పొజిషన్‌లో ఉన్న భర్తతో కలిసి పనిచేస్తుంది. భార్య బాస్ కావడం భర్తకు ఎలాగూ దిగమింగదు కాబట్టి తనను జాబ్ మాన్పించేసి అమ్మగా ఇంట్లోనే కూర్చోబెట్టాలని అనుకుంటాడు. కానీ తనకు నచ్చకపోయినా ఓకే చెప్తుంది ఫాతిమా. అప్పుడే రాయల్ బ్యాంక్ సీఈఓ రాణి నుంచి గొప్ప ఆఫర్ అందుకుంటుంది. కానీ తన ప్రమేయం లేకుండానే డిప్యూటీ సీఈఓగా అనౌన్స్ చేస్తుంది రాణి. ఎలాగూ తనకు ఇష్టమే కాబట్టి ఈ ప్రమోషన్ యాక్సెప్ట్ చేస్తుంది ఫాతిమా. అదే రోజు తనకు అబార్షన్ అవుతుంది. దీంతో భర్త అప్‌సెట్ కావడం, ఆ సమయంలో ఓదార్చే బదులు కోపంగా ప్రవర్తించడం తట్టుకోలేని ఫాతిమా వర్కింగ్ ఏరియాలోనే కాస్త ఉపశమనం పొందుతుంది. భర్త పిల్లలు లేరని పడుతున్న బాధను చూసి సరోగసికి ఓకే చెప్తుంది. కానీ ఈ క్రమంలో మరో వ్యక్తి తనను ప్రేమగా టచ్ చేయడంతో అతడికి అట్రాక్ట్ అవుతుంది. తప్పు అని తెలిసినా తన దగ్గర మనశ్శాంతి దొరుకుతుందని అదే రాంగ్ స్టెప్ రిపీట్ చేస్తుంది. ఇక్కడ కూడా సెక్సువల్ మూమెంట్స్ డోస్ పెంచేశారు మేకర్స్. ఎట్ ఏ టైమ్ నీ శరీరం, నీకు నచ్చిన వ్యక్తి ఎవరితో ఎలా ఉండాలో? ఉండకూడదో అనేది నీ నిర్ణయం అనే మెస్సేజ్ ఈ మెచ్యూర్డ్ క్యారెక్టర్ ద్వారా ఇచ్చారు.

ఆయేషా(ఫ్లబితా):

ఆయేషా టూ క్యూట్ అండ్ ప్రెట్టీ క్యారెక్టర్. ఎట్ ఏ టైమ్ సో కన్ఫ్చూజ్డ్ యంగ్ లేడీ. రాయల్ బ్యాంక్‌లో జూనియర్‌గా జాయిన్ అయిన ఆయేషా తను చేసిన ఒక తప్పుకు హైయర్ ఆఫీసర్ ఫాతిమా ద్వారా జాబ్‌లో నుంచి తీసేయబడుతుంది. ఆ తర్వాత డబ్బులు లేక హాస్టల్ నుంచి నెట్టేయబడుతుంది. ఈ క్రమంలో రాయల్ బ్యాంక్ వాష్ రూమ్స్‌లో ఫ్రెష్ అవుతున్న తను సీఈఓ రాణికి తన ప్రాబ్లమ్ చెప్పడంతో మళ్లీ జాబ్‌లో జాయిన్ అవుతుంది. లిల్లీకి ఓ కంపెనీ సెట్ చేసి పెట్టడమే ఆయేషా పని. అయితే రాయల్ బ్యాంక్‌లో పనిచేసే ఓ సీనియర్ ఎంప్లాయితో పనిచేయాలని కోరుకుంటుంది. ఆ డిపార్ట్‌మెంట్‌కు తనను ట్రాన్స్‌ఫర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటుంది. ఆ వ్యక్తి అందరిలో హుందాగా ప్రవర్తించినా, తనతో ఒంటరిగా ఉన్న సమయంలో లైంగికంగా వేధిస్తాడు. ఆయేషా బైసెక్సువల్ కాగా పబ్‌లో ఓ అమ్మాయికి అట్రాక్ట్ అవుతుంది. మరో కొలిగ్‌తో కూడా రిలేషన్ షిప్‌లో ఉంటుంది. కానీ అప్పుడు కలగని బాధ ఇప్పుడెందుకు కలిగింది. వారితో ఎలాగూ సెక్స్ చేసింది కదా తనతో చేస్తే ఏంటి? అని చూపించకుండా ఒక అమ్మాయి ఎలా ఉన్నా సరే తనకు నచ్చిన విధంగా మాత్రమే నడుచుకోవాలి. తనకు నచ్చిన వ్యక్తితో మాత్రమే కలవాలి. ఈ విషయంలో తేడా వస్తే తప్పకుండా ఓపెన్ అవొచ్చు అనే విషయాన్ని తెరమీదకు తెచ్చి సక్సెస్ అయ్యారు మేకర్స్. బడా ఆసామీని మీటూ ఉద్యమంలోకి లాగి సక్సెస్ సాధించిన యువతిగా చూపించి, సమాజంలో బాధిత యువతుల్లో ఇన్‌స్పిరేషన్ ఇచ్చేలా క్యారెక్టర్ డిజైన్ చేశారు. కానీ ఈ క్యారెక్టర్ అమ్మాయి, అబ్బాయితో రిలేషన్ షిప్, సెక్స్ గురించి చాలా దారుణంగా ప్రెజెంట్ చేశారు.

షాయి(ఆధ్యా ఆనంద్):

షాయి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ ఆధ్యా ఆనంద్‌ టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. బాంబే బేగమ్స్ సిరీస్‌లో ఏ పాత్రకైనా ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారంటే అది ఇదే. షాయికి రాణి స్టెప్ మదర్ కాగా తన బయోలాజికల్ రీప్లేస్ చేయాలనుకుంటుందని తనను హేట్ చేస్తుంటుంది. పదమూడేళ్లు ఉన్నా తను అందరి అమ్మాయిల్లా ఎందుకు ఎదగలేకపోతున్నానని, ఎందుకు బాయ్స్‌ను అట్రాక్ట్ చేయలేకపోతున్నానని ఫీల్ అవుతుంది. తనకు తానే మెచ్యూర్ అయినట్లు క్రియేట్ చేసుకోవడం, క్లాస్‌లో ఇమ్రాన్ అనే కుర్రాడిని లవ్ చేస్తుంది. తను బర్త్ డే పార్టీకి పిలవడంతో ఎగ్జైటింగ్‌గా వెళ్లి ఆ అబ్బాయికి గిఫ్ట్ ఇవ్వగా, దానిని అతడు డస్ట్ బిన్‌లో పడేసి మరో గర్ల్‌తో డ్యాన్స్ చేయడం తట్టుకోలేకపోతుంది. డ్రగ్స్, మందు తీసుకుని అక్కడే స్పృహతప్పి పడిపోతుంది. ఈ సమయంలో స్టెప్ మదర్ రాణి తన పట్ల చూపిన ప్రేమకు ఫిదా అయిన షాయి తనను ట్రూ లవ్‌తో యాక్సెప్ట్ చేయడం వంటి సీన్స్ బాగున్నాయి. ఈ క్యారెక్టర్ చూసి పిల్లలు చెడిపోవచ్చనే టాక్ వచ్చినా రాణి, షాయి మధ్య వచ్చే సీన్స్ మనల్ని రియలైజ్ చేస్తాయి. బయటకు వెళ్లినప్పుడు టీనేజర్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చూపించారు. ఫైనల్‌గా రాణి కూతురు ప్రేమతో తనను టచ్ చేయడంతో తన గతాన్ని వివరిస్తుంది. యంగర్‌గా ఉన్నప్పుడు లైంగికంగా ఎలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేసింది? కంపెనీలో జాయిన్ అయినప్పుడు తన సీనియర్ తనను ఎలా వాడుకున్నాడో తెలుపుతుంది. అలాంటి బ్యాడ్ టచ్ ఎదురైనప్పుడు కచ్చితంగా తనకు చెప్పాలని వివరిస్తుంది. తను చేసిన తప్పు తన కూతురు చేయకూడదని సూచనలిస్తుంది.

మొత్తానికి తను ఇల్లీగల్ రిలేషన్‌లో ఉన్న వ్యక్తి తనకు ఎదురుతిరగడం, ఫ్యామిలీ తనను ప్రేమగా ఆదరించడంతో ట్రూ లవ్ గురించి తెలుసుకున్న రాణి సెక్సువల్ అబ్యూజ్మెంట్ ఎదుర్కొన్న ఇద్దరి ఎంప్లాయిస్ నుంచి కంప్లెయింట్ తీసుకుని, సీనియర్ హోదాలో ఉన్న రాయల్ బ్యాంక్ ఎంప్లాయిని అరెస్ట్ చేయిస్తుంది. ఆ తర్వాత లిల్లీ కంపెనీ ఓపెనింగ్‌లో పాల్గొన్న రాణి మీడియా ముందు తను ఎవరితో లైంగికంగా వేదనకు గురైందో ఓపెన్ అవుతుంది. అటు ఫాతిమాను భర్త విడిచివెళ్లిపోవడం, ఆయేషాకు సొంత ఇల్లు దొరకడంతో హ్యాపీ ఎండింగ్ ఉంటుందని అనుకున్నా..మీటూ ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ చేయబడిన వ్యక్తి రాణికి వ్యతిరేకంగా ఇచ్చిన ఫిర్యాదు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది సెకండ్ సీజన్‌లో చూపించబోతున్నారు.



Next Story

Most Viewed