మాకొద్దు ఈ ప్రభుత్వాసుపత్రి వైద్యం..

by  |
మాకొద్దు ఈ ప్రభుత్వాసుపత్రి వైద్యం..
X

దిశ, భువనగిరి రూరల్ : ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన గర్బిణీ స్త్రీలు అక్కడి వైద్యులు, సిబ్బంది తీరుతో మాకొద్దు ఈ వైద్యమంటూ.. ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లిపోయిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గత వారం క్రితం 8 మంది గర్భిణీ స్త్రీలకు వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రికి వెళ్తే కుట్లు విప్పారని.. అప్పుడు కొంచెం చీము, గ్యాప్ వచ్చిందని వాటి కోసం వైద్యులు మందులు రాశారని బాధితులు తెలిపారు.

అయితే ఆ మందుల వల్ల ఎలాంటి ఫలితం లేకపోగా సమస్య ఇంకా పెరిగిందని బాధిత కుటుంబ సభ్యులు వెళ్లి వైద్యులను ప్రశ్నించగా మళ్లీ ఆపరేషన్ చేసి డబల్ స్టిట్చింగ్ వేయ్యాలనన్నారు. ఆగ్రహానికి గురైన గర్బిణీ స్త్రీల కుటుంబ సభ్యులు వారిని తీసుకొని ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వాస్పత్రికి వస్తే పేషంట్ల పట్ల వైద్యులు, అక్కడి సిబ్బంది ప్రవర్తన తీరు బాలేదని బాధితులు వాపోయారు. ఇలా డబుల్ స్టిట్చింగ్ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోగుల ప్రాణాలకు బాధ్యులెవరని మండిపడ్డారు. పేషంట్లకు సరైన వైద్యం అందించకుండా ఉంటే తమ పరిస్థితి ఏంటని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.

Next Story