అది ఉంటనే ఇండియాకు ఎంట్రీ

by  |
అది ఉంటనే ఇండియాకు ఎంట్రీ
X

న్యూఢిల్లీ: భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం, విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నెగటివ్ రిపోర్టు(ఆర్టీపీసీఆర్) చూపించాలి. అది కూడా ప్రయాణానికి 72గంటల ముందు తీసుకున్నది మాత్రమే అయ్యుండాలి. ఈ నెల 25 నుంచి మార్గదర్శకాలు అమల్లోకి రానున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యూకే, యూరప్, బ్రెజిల్, బంగ్లాదేశ్, చైనా వంటి కేటగిరీ ‘ఏ’లోకి వచ్చే దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారు అదనపు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగా దేశంలోకి వచ్చిన తర్వాత కొవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ ‘బీ’లోకి వచ్చే దేశాలతో భారత ప్రభుత్వం ఓ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తించిన కరోనా వ్యాక్సిన్‌ డోసులను పూర్తిగా తీసుకున్న వ్యక్తులకు జారీ చేసిన సర్టిఫికేట్లను పరస్పరం గుర్తించడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. జాతీయ స్థాయిలో, లేదా డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన వ్యాక్సిన్‌ డోసులను పూర్తిగా తీసుకున్న భారత పౌరులను మినహాయిస్తున్న దేశాలు కూడా ఈ జాబితాలోకి వస్తాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.


Next Story

Most Viewed