అలా ఓట్లు అడిగారని.. బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై కేసు ?

by Dishanational4 |
అలా ఓట్లు అడిగారని..  బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై కేసు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : మత ప్రాతిపదికన ఓట్లు అడిగారంటూ కర్ణాటకలోని బెంగళూరు సౌత్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. మత ప్రాతిపదికన ఓట్లు అడుగుతూ ఆయన గురువారం రాత్రి ట్విట్టర్(ఎక్స్)‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెల్లడించారు. బెంగళూరు సౌత్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి తేజస్వి సూర్య పోటీ చేస్తున్నారు.

‘‘బీజేపీకి 80 శాతం మంది (మెజారిటీ వర్గం ఓటర్లు) మద్దతు ఇస్తున్నప్పటికీ.. పార్టీకి ఓట్లు వేస్తున్నది 20 శాతం మందే. కాంగ్రెస్‌కు 20 శాతం మందే (మైనారిటీ వర్గం ఓటర్లు) మద్దతు ఇస్తున్నప్పటికీ.. ఆ పార్టీకి ఓట్లు వేస్తున్నది 80 శాతం మంది’’ అని కామెంట్ చేస్తూ ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. శుక్రవారం జరిగే పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని ప్రజలకు తేజస్వి సూర్య పిలుపునిచ్చారు. బెంగుళూరు సౌత్ సీటులో కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, కాంగ్రెస్ నేత సౌమ్యారెడ్డితో సూర్య తలపడుతున్నారు. 1996 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉన్న బెంగళూరు సౌత్‌లో తేజస్వి సూర్య 2019 ఎన్నికల్లో 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.



Next Story

Most Viewed