నవ తెలంగాణ లాకౌట్..?

by  |
నవ తెలంగాణ లాకౌట్..?
X

నవతెలంగాణ దినపత్రిక త్వరలో మూతపడనున్నట్టు పక్కా సమాచారం అందుతోంది. నష్టాల్లో కూరుకుపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిన్న పలువురు స్టాఫ్ రిపోర్టర్లను, డెస్క్ జర్నలిస్టులను పిలిపించుకున్న యాజమాన్యం మార్చి 1 నుంచి వారు రావాల్సిన పని లేదని చెప్పారు. అంటే ఒక్కరోజు గడువు మాత్రమే ఇచ్చారు. కాగా, ఈ రోజు మధ్యాహ్నం సబ్ కమిటీ మీటింగ్ ఉన్నట్లు, 3 గంటలకు ఫైనల్ నిర్ణయం చెప్తామని అన్నట్లు వార్తలు వస్తున్నాయి.
రేపటి నుంచి విధుల్లోకి రావద్దని చెప్పినా విలేకరులు నిన్న నవ తెలంగాణ ఎడిటర్ ని కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేసారని, ఉన్నట్టుండి ఉద్యోగాలు తీసివేయడం వల్ల ఇబ్బందుల్లో పడతామని, మూడు నెలల శాలరీ అడ్వాన్స్ గా ఇవ్వాలని కోరారని సమాచారం. లేనిపక్షంలో ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఈ అంశంపైనే చర్చించడానికి సబ్ కమిటీ సమావేశం అవుతున్నదని,
కార్మికుల హక్కుల కోసం పోరాడే కమ్యూనిస్టు పత్రిక ఇలా కార్మికులను రోడ్డున పడేయడం దారుణమనే కామెంట్లు వినపడుతున్నాయి. రోడ్డున పడేవాళ్లలో మహిళా జర్నలిస్టులు చాలా మందే ఉన్నారని సమాచారం. 2015 మార్చ్ లో ప్రారంభమైన ఈ దినపత్రిక కేవలం ఐదేళ్లలోనే మూతపడడం వందలాది జర్నలిస్టులను రోడ్డున పడేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రధాన పత్రికలు తమ పేజీలను, సర్క్యులేషన్ ను తగ్గించుకుంటున్న నేపథ్యంలో ఈ పరిణామం జరుగుతుండడం విషాదకరమని సీనియర్ జర్నలిస్టులు వాపోతున్నారు.


Next Story

Most Viewed