సొరంగంలో సర్వైవ్ కావడానికి యోగా, వాకింగ్, మెడిటేషన్ చేస్తున్న కార్మికులు

by Disha Web Desk 12 |
సొరంగంలో సర్వైవ్ కావడానికి యోగా, వాకింగ్, మెడిటేషన్ చేస్తున్న కార్మికులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగం కుంగిపోయి.. 41 మంది సోరంగంలోనే చిక్కుకొని పోయారు. కాగా ఈ ఘటన జరిగి నేటికి 10 రోజు అవుతుంది. కాగా ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల చిక్కుకున్న వారు సర్వైవ్ కావడానికి యోగా, వాకింగ్, మెడిటేషన్ ను చేస్తున్నారు. కాగా మంగళవారం టన్నెల్ లోపలికి చిన్న రంధ్రాన్ని చేసి దాని ద్వారా కార్మికులకు ఫుడ్, సెల్ ఫోన్, చార్జర్, ఒక రోబిటిక్ కెమెరాని పంపారు. ఈ సందర్భంగా వారు మొట్టమొదటి సారి అధికారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. తామంతా లోపల క్షేమంగానే ఉన్నామని ప్రాణాలతో ఉండేందుకు యోగ, మెడిటేషన్ చేస్తున్నామని తెలిపారు. అలాగే తమను విలైనంత త్వరగా బయటకు తీసుకెళ్లేందు ప్రయత్నం చేయాలని వారు అధికారులకు విన్నవించారు.


Next Story

Most Viewed