వర్క్ విత్ వైన్.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వం న్యూ పాలసీ

by Disha Web Desk 4 |
వర్క్ విత్ వైన్.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వం న్యూ పాలసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగులకు వైన్, బీర్ వంటి (తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్నవి) డ్రింక్స్ సర్వ్ చేసేందుకు అనుమతులు ఇచ్చింది. కనీసం 5వేల మంది సిబ్బంది గల కార్పొరేట్ ఆఫీసుల్లో వైన్, బీర్ అందుబాటులో ఉంచేలా, ఉద్యోగులకు సర్వ్ చేసేందుకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మద్యం పాలసీ 2023-24కి అక్కడి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జూన్ 12 నుంచి కొత్త పాలసీ అమలులోకి రానుంది. కొత్త పాలసీ ప్రకారం.. కార్పొరేట్ కార్యాలయాల్లో మద్యం లైసెన్స్ పొందాలంటే సదరు కార్యాలయంలో 2000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో క్యాంటీన్ వుండాలని పేర్కొంది.

రిటైల్ పర్మిట్ రుసుము కింద పర్యావరణం, జంతు సంక్షేమ నిధి కోసం రూ. 400 కోట్లను సమీకరించాలని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టార్గెట్‌ను చేరుకునేందుకు ప్రభుత్వం నూతన పాలసీని రూపొందించింది. తాజాగా తీసుకు వచ్చిన పాలసీ ప్రకారం.. అన్ని కార్పొరేట్ ఆఫీసుల్లో సుమారు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగుల కోసం క్యాంటీన్ లేదా తినుబండరాలు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. మరోవైపు ఈ పాలసీలో భాగంగా దేశీయ లిక్కర్, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఇంపోర్టెడ్ ఫారిన్ లిక్కర్ బేసిక్ కోటాను కూడా ప్రభుత్వం పెంచింది.

Read more:

బెల్లం కలిపిన నీళ్లను తీసుకోవడం వలన ఎన్ని లాభాలో తెలుసా?

Next Story

Most Viewed