- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
అధికారంలోకి వస్తే 3 లక్షల ఉద్యోగాలు: మేఘాలయాలో టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టో

షిల్లాంగ్: మేఘాలయాలో ఎన్నికల బరిలోకి దిగుతున్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం 10 పాయింట్లతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించింది. పార్టీ నేత అభిషేక్ బెనర్జీ షిల్లాంగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మేనిఫెస్టోను విడుదల చేశారు.
సరిహద్దు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాకుండా సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు, మహిళలకు ప్రతి నెలా రూ.1,000 భత్యం ఇస్తామని హామీ ఇచ్చారు. టూరిజం సెక్టార్‌లో జాబ్ కార్డులు అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే హామీలన్ని నేరవేరుస్తామని తెలిపారు.
రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎకానమీ, డబుల్ జీడీపీ వృద్ధి, 4 వేల చిన్న మధ్య తరహా ఎంటర్ ప్రైజెస్ కల్పించడంతో పాటు శాస్త్రీయంగా మైనింగ్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా టీఎంసీని బయటివారిగా ఆరోపించడాన్ని ఖండించారు. అయితే మేఘాలయాలో టీఎంసీ ప్రభుత్వం స్థానికులచే నడుపుతామని హామీ ఇస్తామని, అదే పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అలాంటి ప్రతిజ్ఞ చేస్తుందా అని ప్రశ్నించారు. కాగా, ప్రస్తుతం మాజీ సీఎం ముకుల్ సంగ్మా చేరికతో రాష్ట్రంలో టీఎంసీ ప్రధాన విపక్షంగా ఉంది.