- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vivek Ramaswamy : డోజ్ బాధ్యతల నుంచి తప్పుకున్న వివేక్.. ఆ ఎన్నికల కోసమేనా..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కార్యవర్గంలో కీలకమైన డోజ్.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) బాధ్యతల నుంచి ఇండో అమెరికన్ బిజినెస్ మ్యాన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) తప్పుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కార్యవర్గంలో కీలకమైన డోజ్.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) బాధ్యతల నుంచి ఇండో అమెరికన్ బిజినెస్ మ్యాన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) తప్పుకున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. డోజ్‌కు వివేక్‌తోపాటు టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌లను హెడ్స్ గా ట్రంప్ నియమించారు. వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్ పని చేస్తోంది. అయితే, ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం కోసం వివేక్ ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. తర్వాత ట్రంప్ విజయం కోసం కష్టపడ్డారు. 2026 జులై 4న అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం జరగనుంది. ఆలోగా.. డీవోజీఈ లక్ష్యాన్ని పూర్తి చేసి, గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివేక్ రెడీ అవుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, అంతలోనే వివేక్ నిర్ణయం మార్చుకున్నారు. గవర్నర్‌గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతుండటంతోనే డోజ్ నుంచి వైదొలగుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, ఒహియో గవర్నర్ ఎన్నికలు నవంబర్ 2026లో జరగనున్నాయి.
ట్రంప్ తరఫున ప్రచారం
ఇకపోతే, వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ఒహియోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికా(America)కు వలస వచ్చారు. హార్వర్డ్ నుంచి బయోలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యేల్ లా స్కూల్‌లో ఉన్నతవిద్యను పూర్తి చేశారు. విద్యాభ్యాసం అనంతరం సొంతంగా బయోటెక్ సంస్థ (Roivant Sciences)ను స్థాపించారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తరఫున ఇంటర్వ్యూల్లో వాదనలు వినిపించారు. రామస్వామి పనితీరును గమనించిన డొనాల్డ్.. పెన్సిల్వేనియాలో జరిగిన సభలో ఆయన్ను తన కార్యవర్గంలోకి తీసుకొంటానని ప్రకటించారు. మొదట ఆయనకు విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, ట్రంప్ ప్రచార బృందంలో కీలక భూమిక వహించిన మార్కో రూబియో (Marco Rubio)కు ఆ శాఖ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.






