- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Waqf Bill: లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు ఎట్టకేలకు లోక్‌సభలోకి ఎంటరైంది.

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు ఎట్టకేలకు లోక్‌సభలోకి ఎంటరైంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదానికి లోక్‌సభలో సంఖ్యాబలం 272 కాగా.. ఎన్డీఏ బలం 298, విపక్ష పార్టీ సంఖ్యా బలం 233, ఇతరులు 11 ఉంది. ఈ సందర్భంగా వక్ఫ్ బిల్లుపై కిరణ్ రిజిజు మాట్లాడతూ.. కేబినెట్ ఆమోదం తరువాతే బిల్లును సభలో ప్రవేశపెట్టామని అన్నారు. బిల్లుపై కూడా విస్తృతంగా చర్చ జరిపామని తెలిపారు. జేపీసీకి బిల్లుపై 96 లక్షల విజ్ఞప్తులు అందాయని అన్నారు. విల్లు గురించి విపక్షాలు వందతులు ప్రచారం చేశాయని ఆరోపించారు. బిల్లులోని లేని అశాలను లేవనెత్తి ప్రజలకు తప్పుదోవ పట్టిచాయని కామెంట్ చేశారు.
Waqf Bill: లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలుమైనారిటీల్లో అసవసర భయాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 1954లో తొలిసారి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. సవరణ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేశారు. వక్ఫ్ చట్ట సవరణలపై ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తామని అన్నారు. యూపీఏ అధికారంలో ఉంటే ఢిల్లీలోని కీలక స్థలాలు వక్ఫ్ సొంతం అయ్యేవని తెలిపారు. విలువైన ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్‌కు కాంగ్రెస్ కట్టబెట్టిందని అన్నారు. మసీదులు నిర్వహణపై ఈ చట్టం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.






