బిగ్ బ్రేకింగ్: లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ స్టార్ట్

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ స్టార్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం లోక్ సభలో చర్చ జరిగింది. దాదాపు 7 గంటలపాటు ఈ బిల్లుపై సభలో డిస్కషన్స్ జరగగా.. దాదాపు 60 మంది ఎంపీలు మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్టీలు తమ స్టాండ్‌ను వెల్లడించాయి. బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు విమర్శించగా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో సమాధానమిచ్చారు. అనంతరం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు జరిగిన వెంటనే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతామని తెలిపారు. అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ నుండి వాకౌట్ చేసింది.



Next Story

Most Viewed