Delhi Assembly speaker : ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా విజేందర్ గుప్తా!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-20 07:08:51  IST  )

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్(Delhi Assembly speaker) పదవికి భారతీయ జనతా పార్టీ తరపున రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా(Vijender Gupta)నామినేట్ అయ్యారు.

Delhi Assembly speaker : ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా విజేందర్ గుప్తా!
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్(Delhi Assembly speaker) పదవికి భారతీయ జనతా పార్టీ తరపున రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా(Vijender Gupta)నామినేట్ అయ్యారు. పార్టీ తన నామినేషన్ ను ధృవీకరించిందని గుప్తా వెల్లడించారు. రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడవసారి ఎన్నికైన గుప్తా.. గతంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆప్ సర్కార్ తన పని తీరుపై 14 కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలను సమర్పించకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.

ఇప్పడు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నిక కాబోతున్న తాను గత ఆప్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన కాగ్ నివేదికలను సభ ముందు ఉంచుతానని గుప్తా ప్రకటించారు. కొత్తగా ఏర్పాటైన 8వ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ పార్టీకి 48 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ప్రతిపక్ష అప్ పార్టీకి 22 మంది శాసనసభ్యులు ఉన్నారు. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గా గుప్తా ఎన్నిక లాంఛనమే కానుంది. గత ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయేందర్ గుప్తా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.

అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో మార్షల్స్‌ను పిలిచి విజయేంద్ర గుప్తాను అసెంబ్లీ నుండి పలుమార్లు బయటకు పంపించింది. ఆప్ ప్రభుత్వంలో అవమానాలకు గురైన విజయేంద్ర గుప్తాకు ఏకంగా అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించే స్పీకర్ బాధ్యతను బీజేపీ అప్పగించడం విశేషం. డిప్యూటీ స్పీకర్ పదవికి మోహన్ సింగ్ బిష్ట్ పేరును ప్రకటించింది. మోహన్ సింగ్ బిష్ట్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి ఆయన ముస్తఫాబాద్ అసెంబ్లీ స్థానం నుండి గెలిచారు.

ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా(CM Rekha Gupta)ను ఎంపిక చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏకైక మహిళా సీఎం రేఖా గుప్తానే కావడం విశేషం. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మను ఎంపిక చేసింది. ఈరోజు రామ్ లీలా మైదానంలో రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రులు ప్రజల సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు ఎన్డీయే పక్ష సీఎంలు, ఎంపీలు హాజరుకానున్నారు.

Next Story