ఒక దొంగ తమ దొంగనే విచారిస్తాడా? పాక్ ప్రధానికి కేంద్రమంత్రి కౌంటర్

by Ajay Maddhiboyina |

పహల్గామ్ ఘటనపై తటస్థంగా విచారణ జరిపిద్దాం అంటూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి సుకాంట మజుందార్ సెటైర్లు వేశారు.

ఒక దొంగ తమ దొంగనే విచారిస్తాడా? పాక్ ప్రధానికి కేంద్రమంత్రి కౌంటర్
X

దిశ‌, వెబ్ డెస్క్: పహల్గామ్ ఘటనపై తటస్థంగా విచారణ జరిపిద్దాం అంటూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి సుకాంట మజుందార్ సెటైర్లు వేశారు. ఒక దొంగను తమ గ్రూపులోని దొంగనే విచరిస్తాడా అంటూ వ్యాఖ్యానించారు. దాడి వెనుక ఏ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఇప్పటికే తెలిసిపోయిందన్నారు. పాకిస్థాన్ లోకి కొంతమంది మేమే చేశాం.. మేమే చేశామని మొత్తుకుంటున్నారని అన్నారు. ఇంకా ఏం ఇన్విస్టిగేషన్ చేస్తారని మండిపడ్డారు.

కేవలం భయంతోనే పాకిస్థాన్ ప్రధాని అలాంటి కామెంట్లు చేశాడని అన్నారు. ఈ భయం మంచిదేనని భావించారు. ఆయనకు ఈ భయం ఉండాలని, పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నా లేకపోయినా మనం బదులిస్తామని చెప్పారు. పాకిస్థాన్ సిద్ధంగా లేనప్పుడే మనం మరింత బలంగా కొట్టగలమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే పహల్గామ్ దాడి వెనక పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని గుర్తించారు. ఉగ్రవాద సంస్థలను పాక్ పెంచి పోశిస్తోంది అనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

Next Story