మోడార్నా వ్యాక్సిన్‌కు యూకే ఔషధ నియంత్రణ ఆమోదం

by Dishanational4 |
మోడార్నా వ్యాక్సిన్‌కు యూకే ఔషధ నియంత్రణ ఆమోదం
X

లండన్: ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణలో యూకే శుభవార్త చెప్పింది. నవీనీకరించిన మోడార్నా వ్యాక్సిన్‌కు యూకేకు చెందిన ఔషధ నియంత్రణ సంస్థ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్‌ఆర్ఏ) ఓ ప్రకటన చేసింది. 'యూకే ప్రమాణాలు భద్రత, నాణ్యత, సమర్థతను వ్యాక్సిన్ అందుకుంది. దీంతో 18 ఏళ్ల పైబడిన వారిలో బూస్టర్ డోసుగా వాడేందుకు ఆమోదం పొందింది' అని పేర్కొంది. బ్రిటిష్ నియంత్రణ సంస్థ ఆమోదం పొందిన బైవాలెంట్ తరహా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. క్లినికల్ ట్రయల్స్‌లో కరోనా వైరస్, ఒమిక్రాన్ కు వ్యతిరేకంగా బలమైన ఇమ్యూనిటిని ప్రొత్సహించిందని ఎంహెచ్‌ఆర్ఏ చీఫ్ జునే రైనే అన్నారు.

దేశ అభివృద్ధికి ఉచిత విద్య, వైద్యమే ముఖ్యం: కేజ్రీవాల్

Next Story