ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్..? నేడు డీఎంకే ఎమ్మెల్యేల కీలక సమావేశం

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-05 04:46:22  IST  )

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ నేడు ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్..? నేడు డీఎంకే ఎమ్మెల్యేల కీలక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడటంతో తమిళనాట రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎలాగైన మళ్లీ అధికారంలోకి వస్తామని అనుకన్న డీఎంకే (DMK)కు భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. కాసేపట్లో గెలిచిన డీఎంకే ఎమ్మెల్యేలతో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) భేటీ కాబోతున్నారు. డీఎంకే శాసనసభా పక్ష నేతగా మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

యువతను ఆకట్టుకోవడంలో ఉదయనిధి సక్సెస్ కావడంతో, అసెంబ్లీలో ప్రతిపక్ష గళాన్ని ఆయనకే అప్పగించాలని స్టాలిన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో వచ్చిన ఫలితాలపై స్టాలిన్ సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ ఓటమికి గల కారణాలు, క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లు, భవిష్యత్తు కార్యాచరణపై గెలిచిన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కూడా డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

Next Story