రాహుల్ గాంధీని హెచ్చరించిన ఉద్ధవ్ ఠాక్రే

by Disha Web Desk 12 |
రాహుల్ గాంధీని హెచ్చరించిన ఉద్ధవ్ ఠాక్రే
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఎన్‌సిపి, కాంగ్రెస్‌తో శివసేన (యుబిటి) పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో వీరంతా కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పడు సడెన్ గా ఉద్ధవ్ ఠాక్రే రాహుల్ గాంధీని తీవ్రంగా హెచ్చరించడంతో పొలిటికల్‌గా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ గత కొద్దిరోజులుగా సందర్భం వచ్చినప్పుడల్లా వీర్ సావర్కర్ ను టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేస్తున్నాడు. దీంతో శివసేన (యుబిటి) ఉద్ధవ్ ఠాక్రే వీర్ సావర్కర్‌ను అవమానించడంపై రాహుల్ గాంధీని హెచ్చరించారు. "మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము, కానీ మా దేవుళ్లను అవమానించడం మేము సహించేది కాదు" అని ఉద్ధవ్ ఠాక్రే చెప్పాడు. కాగా రాహుల్ గాంధీ.. మాట్లాడుతూ.. క్షమించమని కోరడానికి నేనేమి సావర్కర్ ను కాదని.. గాంధీని అని.. పరోక్షంగా సావర్కర్ ను టార్గేట్ చేస్తు మాట్లాడాడు.



Next Story

Most Viewed