కర్ణాటక సీఎంగా డీకే శివ కుమార్.. డిప్యూటీ సీఎంలుగా ముగ్గురికి అవకాశం!

by Gantepaka Srikanth |

కర్నాటక రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైంది.

కర్ణాటక సీఎంగా డీకే శివ కుమార్.. డిప్యూటీ సీఎంలుగా ముగ్గురికి అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైంది. రేపు (మే 29, శుక్రవారం) జరగబోయే కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) సమావేశంలో ఆయనను అధికారికంగా లీడర్‌గా ఎన్నుకోనున్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను బ్యాలెన్స్ చేయడానికి కొత్త ప్రభుత్వంలో ఇద్దరు లేదా ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం ఉంది. లింగాయత్, దళిత సామాజిక వర్గాల నుంచి వీరు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆకస్మిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బెంగళూరు నగరవ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్, డీకే శివకుమార్ నివాసం, సిద్ధరామయ్య నివాసాల వద్ద వెయ్యి మందికి పైగా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. సిద్ధరామయ్య రాజీనామాతో కర్ణాటక రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయం ముగిసినట్లయింది. అయితే, కొత్త మంత్రిమండలి కూర్చు, సిద్ధరామయ్య వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story