బ్రేకింగ్: స్పీడ్ పెంచిన జమిలీ ఎన్నికల పరిశీలన కమిటీ.. ఢిల్లీలో ఫస్ట్ మీటింగ్ స్టార్ట్..!

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: స్పీడ్ పెంచిన జమిలీ ఎన్నికల పరిశీలన కమిటీ.. ఢిల్లీలో ఫస్ట్ మీటింగ్ స్టార్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగంగా జరుగుతోంది. భారత్‌లో జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన 8 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ కమిటీ జమిలీ ఎన్నికల నిర్వహణపై స్పీడ్ పెంచింది. కమిటీ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఆ కమిటీ ఇవాళ తొలిసారి భేటీ అయ్యింది. 8 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ తొలిసారి ఇవాళ సమావేశమయ్యింది.

కాగా, రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ తొలి సమావేశానికి కమిటీ మెంబర్స్, కేంద్రమంత్రులు అమిత్ షా, అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. ఈ కమిటీలో చోటు దక్కించుకున్న కాంగ్రెస్ పార్లమెంటరీ నేత అధిర్ రంజన్ చౌదరీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఈ కమిటీ ప్రకటించిన రోజే ఆ కమిటీలో ఉండబోనని అధిర్ రంజన్ చౌదరి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ముందు చెప్పిన విధంగానే ఆయన ఇవాళ జరిగిన భేటీకి హాజరుకాలేదు. జమిలీ ఎన్నికలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుండటంతోనే ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.


Next Story