The Super Rich: మాపై మరింత భారీ పన్నులు వేయండి.. 400 మంది సంపన్నుల డిమాండ్

by Prasad Jukanti |   (  Updated:2026-01-21 13:09:10  IST  )

తమపై భారీగా పన్నులు విధించాలని శ్రీమంతులు రాసిన లేఖ వైరల్‍గా మారింది.

The Super Rich: మాపై మరింత భారీ పన్నులు వేయండి.. 400 మంది సంపన్నుల డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ధనిక - పేదల మధ్య అంతరం (Rich-Poor Gap) తరాలుగా కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో ఆ అగాథం మరింత పెరుగుతోంది. ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా తమపై మరింత భారీగా పన్నులు (Super Rich Tax) విధించాలని 400 మంది సంపన్నులు చేసిన డిమాండ్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టుతోంది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (Davos World Economic Forum) నేపథ్యంలో 24 దేశాలకు చెందిన శ్రీమంతులు తమపై భారీగా పన్నులు విధించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు Time to win పేరుతో డిజిటల్ సంతకాలు చేసిన బహిరంగ లేఖను విడుదల చేశారు.

లేఖపై ప్రముఖుల సంతకాలు:

ఈ లేఖపై నటుడు మరియు చిత్రనిర్మాత మార్క్ రుఫలో , సంగీతకారుడు బ్రియాన్ ఎనో, చిత్ర నిర్మాత అబిగైల్ డిస్నీ వంటి ప్రముఖులు సంతకాలు చేశారు. సూపర్ రిచ్ వ్యక్తులకు, మిగతా మానవాళికి మధ్య అంతరం నానాటికీ పెరుగుతున్నదని దీనిని రూపుమాపాలంటే ధనవంతులపై మరింత పన్నులు విధించాలని వీరంతా సూచించారు. శ్రీమంతులు కొందరు ప్రజాస్వామ్య వ్యవస్థలను కొనుగులు చేస్తున్నారని, ప్రభుత్వాలను స్వాధీనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛను సైతం హరిస్తూ ఇన్నోవేషన్లపై పట్టుబిగించారని ఈ పరిణామాలన్ని ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నదన్నారు. అసలైన ప్రజాస్వామ్య వ్యవస్థలను తిరిగి తీసుకువచ్చేలా ప్రగతిశీల సంపద పన్నులు విధించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల కుబేరుల జీవన ప్రమాణాలు ఏమి పడిపోవనని పైగా ఆరోగ్యం, విద్య వంటిప్రజాసేవలకు మరిన్ని నిధులు అందుతాయని పేర్కొన్నారు.

Next Story