- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడికి కస్టడీ పెరోల్
ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడు మహమ్మద్ తాహిర్ హుస్సేన్(Mohammad Tahir Hussain)కు సుప్రీంకోర్టు (Supreme Court) కస్టడీ పెరోల్ మంజూరు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడు మహమ్మద్ తాహిర్ హుస్సేన్(Mohammad Tahir Hussain)కు సుప్రీంకోర్టు (Supreme Court) కస్టడీ పెరోల్ మంజూరు చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు ఆయనకు కస్టడీ పెరోల్ మంజూరు చేస్తూ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థిగా మహమ్మద్ తాహిర్ హుస్సేన్ పోటీ చేస్తున్నారు. కాగా.. బెయిల్ షరతుల ప్రకారం.. ప్రతిరోజు పోలీసు ఎస్కార్ట్ మధ్యే జైలు నుంచి బయటకు వెళ్లి 12 గంటల సేపు ఆయన ప్రచారం చేసుకోవచ్చు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ వెసులుబాటు కల్పించారు. కస్టడీ పెరోల్ కింద ఇద్దరు పోలీసు సిబ్బంది, జైలు వ్యాను, ఎస్కార్ట్ వాహనానికి అయ్యే ఖర్చు ఆయనే భరించాలని కోర్టు షరతు విధించింది. రోజుకు సుమారు 2 లక్షల చొప్పున రెండ్రోజుల అడ్వాన్స్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, తన పార్టీ కార్యాలయానికి వెళ్లవచ్చని, తన నియోజకవర్గం ఓటర్లతో సమావేశం నిర్వహించుకోవచ్చని సూచించింది. అయితే కారవాల్ నగర్‌లోని తన సొంత ఇంటికి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. తనపై ఉన్న పెండింగ్ కేసుల వ్యవహారంపై కూడా ఆయన మాట్లాడవద్దని సూచించింది.
తాత్కాలిక బెయిల్ తిరస్కరణ
కాగా, తాత్కాలిక బెయిల్ కోరుతూ తాహిర్ హుస్సేన్ చేసిన విజ్ఞప్తిని ఇటీవలే సుప్రీంకోర్టు నిరాకరించింది. ద్విస్వభ్య ధర్మాసం పరస్పర విరుద్ధమైన తీర్పు ఇవ్వడంతో ఆయనకు బెయిల్ దొరకలేదు. దీనికి ముందు జనవరి 14న నామినేషన్ వేసేందుకు ఢిల్లీ హైకోర్టు ఆయనకు కస్టడీ పెరోల్ ఇచ్చింది. 2020 ఫిబ్రవరి 24న ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, ఇంటెలిజెన్స్ బ్యూరో స్టాఫర్ అకింత్ శర్మ మృతి చెందాడు. ఆ కేసులోనే హుస్సేన్ నిందితుడిగా ఉన్నారు.






