34కు చేరిన సుప్రీంకోర్టు న్యాయూమర్తులు: జస్టిస్ ప్రసన్న బీ వరాలే ప్రమాణం

by Dishanational2 |
34కు చేరిన సుప్రీంకోర్టు న్యాయూమర్తులు: జస్టిస్ ప్రసన్న బీ వరాలే ప్రమాణం
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రసన్న బీ వరాలే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆయనతో ప్రమాణం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టిన మూడో దళిత న్యాయమూర్తిగా వరాలే నిలిచారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వరాలేను సుప్రీంకోర్టు కొలీజియం జనవరి 19న అత్యున్న న్యాయస్థానంలో జడ్జిగా నియమించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. సిఫార్సు చేసిన 7 రోజుల్లోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. గతేడాది సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పదవీ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో తాజాగా వరాలేతో ఆ స్థానాన్ని భర్తీ చేశారు. జస్టిస్ వరాలే 1962 జూన్ 23న జన్మించారు. మరట్వాడాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం న్యాయ శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలపై ప్రాక్టీస్ చేశాడు. 2008 జూలై 18న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ‘జస్టిస్ వరాలే సత్ప్రవర్తన కలిగిన న్యాయవాది. హైకోర్టు న్యాయవాదిగా నియామకానికి ముందు అతను 23 ఏళ్ల లా ప్రాక్టీస్ కలిగి ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల ఉమ్మడి ఆల్ ఇండియా సీనియారిటీ జాబితాలో ఆరో స్థానంలో పిలిచాడు. ఈ క్రమంలో అపెక్స్ కోర్టు న్యాయమూర్తిగా ఎదగడానికి అర్హత సాధించాడు’ అని ’ అని కొలీజియం పేర్కొంది.

Next Story

Most Viewed