- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోనమ్ వాంగ్‌చుక్ కేసులో వారికి సుప్రీంకోర్టు నోటీసులు
లడక్ అల్లర్ల కేసులో పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: లడక్ అల్లర్ల కేసులో పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే తన భర్త అరెస్టును వ్యతిరేకిస్తూ.. ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో , తనను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఈ పిటిషన్ పై ఈ రోజు సుప్రీం విచారణ చేపట్టగా.. గీతాంజలి ఆంగ్మో తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal), నిర్బంధానికి గల కారణాలను కుటుంబానికి అందించలేదని వాదించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతం లడఖ్, జోధ్‌పూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు సుప్రీం కోర్టు నోటీసులు (Supreme Court Notices) జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. అయితే సిబల్ వాదనలపై స్పందిస్తూ.. అలాగే నిర్బంధానికి గల కారణాలను ఇప్పటికే అందజేశామని, ఆ కారణాల కాపీని తన భార్యకు అందజేయడాన్ని పరిశీలిస్తానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పుకొచ్చారు.






