స్టాప్ హిందీ ఇంపోజిషన్... ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద ట్వీట్

by Disha Web Desk |
స్టాప్ హిందీ ఇంపోజిషన్... ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ ప్రజలను హిందీ ఏకం చేస్తుందని, ప్రాంతీయ భాషలకు సాధికారత కల్పిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పటిలాగే హిందీ భాషపై ప్రేమను కురిపించారని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఇవాళ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేశారు. హిందీ చదివితే పురోగమిస్తాం.. అని అరవడానికి ఈ ఆలోచన ప్రత్యామ్నాయ రూపమని విమర్శించారు. తమిళనాడులో తమిళం, కేరళలో మలయాళం మాట్లాడుతారని, హిందీ ఈ రెండు రాష్ట్రాలను ఎక్కడ కలుపుతుందని, సాధికారత ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు. నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాష యావత్ భారత యూనియన్‌ను ఏకం చేస్తుందని చెప్పడం విడ్డూరమని, హిందీ కాకుండా ఇతర భాషలను ప్రాంతీయ భాషలుగా కించపరచడం అమిత్ షా మానుకోవాలని సూచించారు. స్టాప్ హిందీ ఇంపోజిషన్.. అంటూ ట్వీట్ చేశారు.



Next Story