- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రణిల్ విక్రమసింఘేకు బెయిల్ రిజెక్ట్.. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రికి తరలింపు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు బెయిల్ మంజూరు చేసేందుకు కొలంబో మెజిస్ట్రేట్ నిరాకరించింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కొలంబో నేషనల్ ఆస్పత్రికి తరలించారు.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (76)ను (Ranil Wickremesinghe Arrest) నిన్న ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని అభియోగాలు వచ్చిన నేపథ్యంలో విక్రమ సింఘే అరెస్టయ్యారు. అనంతరం బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. కోర్టు బెయిల్ ను నిరాకరించింది. 6 గంటలపాటు వాదనలు విన్న కొలంబో (Colombo) మెజిస్ట్రేట్ బెయిల్ ను తిరస్కరించడంతో ఆయన్ను పోలీసులు జైలుకు తరలించారు. అక్కడ విక్రమసింఘే అస్వస్థతకు గురికావడంతో కొలంబో నేషనల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
హై బీపీ, షుగర్ ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో ఆయనకు ఇంటి భోజనాన్ని అందించేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది. 2023లో యూకే పర్యటనకు LKR 16.6 మిలియన్ల నిధులను దుర్వినియోగం చేశారని విక్రమసింఘేపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విక్రమసింఘే దోషిగా తేలితే 20 సంవత్సరాల వరకూ జైలుశిక్ష పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.






