- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈసారి అత్యధిక వర్షపాతం.. రుతుపవనాల రాకపై ఐఎండీ కీలక ప్రకటన
అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. అంచనా కంటే పదిరోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు, శ్రీలంక, అండమాన్ లోకి ప్రవేశించి విస్తరిస్తుండటంతో.. మే 24,25 తేదీల్లో కేరళను కూడా తాకవచ్చని ఐఎండీ తెలిపింది. ప్రతి ఏటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురవడం మొదలవుతుంది. జూలై 8 నాటికి దేశమంతా విస్తరించి.. సెప్టెంబర్ 17 నుంచి రుతుపవనాలు ఉపసంహరణ స్టార్ట్ అయి అక్టోబర్ 15 నాటికి ముగుస్తుంది.
2022లో మే 29న, 2023లో జూన్8న, గతేడాది మే 30న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈసారి రుతుపవనాలు కాస్త ముందుగానే రాగా.. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జోరువానలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా చెదురు, మదురు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, అకాల వర్షానికి రైతన్నలు పంట నష్టపోయి దిగులు చెందుతున్నారు. వాగులు, వెంకలు పొంగి పొర్లుతుండగా.. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కేరళ, కర్నాటక, గోవాలో కురుస్తున్న అతిభారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రిస్సూర్ జిల్లా కుణ్ణంకుళంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. కన్నూర్‌లో 18, తలస్సెరిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.






