దేశవ్యాప్తంగా 'SIR' ను నిలిపివేయలేం.. పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

by Malleboina Mahesh |

దేశవ్యాప్తంగా అమలు అవుతున్న 'SIR.' ప్రక్రియను తక్షణమే ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో పిటిషనర్లకు బిగ్ షాక్ తగిలింది.

దేశవ్యాప్తంగా SIR ను నిలిపివేయలేం.. పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా అమలు అవుతున్న 'SIR.' ప్రక్రియను తక్షణమే ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు లో పిటిషనర్లకు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అంశంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 'S.I.R.' ప్రక్రియ కొనసాగుతున్నందున, ఈ దశలో దానిపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రిప్లై దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం (EC) ని ఆదేశించింది. దీంతో ఈ అంశంపై తుది నిర్ణయం కోసం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.

ఇదిలా ఉంటే భారత ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (Special Intensive Revision - SIR) ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ తేదీలను ఖరారు చేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఈ కీలక అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టి సారించింది. ఈ క్రమంలో, కేరళ రాష్ట్రానికి సంబంధించిన పిటిషన్లను డిసెంబర్ 2న, తమిళనాడుకు సంబంధించిన పిటిషన్లను డిసెంబర్ 4న, పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన పిటిషన్లను డిసెంబర్ 9న విచారణకు జాబితా చేసింది. ఈ విధంగా, పలు రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితా సవరణ పై దాఖలైన సవాళ్లను సుప్రీంకోర్టు ఒకేసారి విచారణకు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story