ఎన్నికల బరిలో ఫుట్ బాలర్ భైచుంగ్ భూటియా

by Dishanational4 |
ఎన్నికల బరిలో ఫుట్ బాలర్ భైచుంగ్ భూటియా
X

దిశ, నేషనల్ బ్యూరో : సిక్కింలో ఏప్రిల్ 19న ఒకే విడతలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్షాలు అన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. రాష్ట్రంలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్‌సభ స్థానం ఉన్నాయి. అధికార పార్టీ ‘సిక్కిం క్రాంతికారి మోర్చా’ (ఎస్‌కేఎం) లోక్‌సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ ఇంద్ర హంగ్ సుబ్బా పేరునే మళ్లీ ఖరారు చేసింది. ఇక సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల (సోరెంగ్-చకుంగ్, రెనోక్) నుంచి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో తాను గెలిచిన అసెంబ్లీ స్థానం నామ్చి-సింఘితాంగ్ నుంచి తన భార్య కృష్ణ కుమారి రాయ్‌ను సీఎం బరిలోకి దింపారు. ఇదే సీటు నుంచి ప్రతిపక్ష పార్టీ సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డీఎఫ్) అధ్యక్షుడు పవన్ కుమార్ చామ్లింగ్‌ పోటీ చేస్తుండటం గమనార్హం. అయితే ఈసారి తన కుమారుడు ఆదిత్య గోలేకు అసెంబ్లీ టికెట్‌ను ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ కేటాయించలేదు. గతేడాది నవంబరులో ఎస్‌డీఎఫ్ పార్టీలో చేరిన ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ భైచుంగ్ భూటియాకు బర్‌ఫుంగ్ అసెంబ్లీ టికెట్ దక్కింది.


Next Story

Most Viewed