- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Narendra Modi : భూమిని చేరిన శుభాంశు శుక్లా.. ప్రధాని మోడీ హర్షం
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Subhansu Sukla) అంతరిక్ష కేంద్రం(ISC) నుంచి నేడు క్షేమంగా భూమిని చేరిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Subhansu Sukla) అంతరిక్ష కేంద్రం(ISC) నుంచి నేడు క్షేమంగా భూమిని చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) శుభాంశు శుక్లా, అతని బృందాన్ని అభినందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 18 రోజుల విజయవంతమైన ఆక్సియం-4 మిషన్ పూర్తి చేసుకొని భూమికి తిరిగి రావడంపై హర్షం వ్యక్తం చేసారు. ఈ చారిత్రాత్మక యాత్ర భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్‌యాన్‌కు మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. శుక్లా యొక్క సాహసం కోట్లాది భారతీయుల కలలకు ప్రేరణగా నిలిచిందని అన్నారు.
శుక్లా ISSలో నిర్వహించిన 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు, ముఖ్యంగా ఇస్రో తరఫున ఏడు ప్రయోగాలు, భారత అంతరిక్ష పరిశోధనలకు విలువైన అనుభవాన్ని అందించాయని వెల్లడించారు. ఇది గగన్‌యాన్ మిషన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోడానికి ఉపయోగపడుతుందని అన్నారు. “శుభాంశు శుక్లా ధైర్యంగా, అంకితభావంతో మనదేశ అంతరిక్ష ఆకాంక్షలను నెరవేర్చారన్నారు. ఇది వికసిత్ భారత్ యొక్క లక్ష్యానికి మరింత ఊపందిస్తుంది” అని మోదీ తన సందేశంలో తెలిపారు.






