- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్విషా శర్మ మృతికేసులో బిగ్ ట్విస్ట్.. కోర్టులో లొంగిపోయిన భర్త
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా టెక్కీ.. ట్విషా శర్మ (33) మృతికేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా టెక్కీ.. ట్విషా శర్మ (33) మృతికేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 10 రోజులుగా పరారీలో ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్.. శుక్రవారం సాయంత్రం జబల్ పూర్ జిల్లా కోర్టులో లొంగిపోయాడు. తన క్లైంట్ లొంగిపోయేందుకు రెడీగా ఉన్నాడని సమర్థ్ తరఫు న్యాయవాది మధ్యప్రదేశ్ హైకోర్టుకు ముందస్తు సమాచారమిచ్చారు. దాంతో నిందితుడు ట్రయల్ కోర్టులో లేదా భోపాల్ లోని కటారా పోలీస్ స్టేషన్లో లొంగిపోయేందుకు అనుమతిని ఇచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. భార్య అంత్యక్రియల ఏర్పాట్ల అనంతరం సమర్థ్ లొంగిపోతాడని, అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా విత్ డ్రా చేసుకుంటున్నట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ కేసు విచారణలో మధ్యప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ట్విషా శర్మ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రాథమిక నేరం, ఆత్మహత్యకు ప్రేరేపించడం, నేరపూరిత కుట్ర.. అన్ని కోణాల్లోనూ విచారించాలని సీబీఐని ఆదేశిస్తూ హోంశాఖ కార్యదర్శి కృష్ణవేణి దేశావతు నోటిఫికేషన్ విడుదల చేశారు. వెంటనే ట్విషాశర్మ మృతి కేసు విచారణ ఫైళ్లను సీబీఐకు బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా.. మే 12న భోపాల్ లోని అత్తగారింట్లో ట్విషాశర్మ శవమై కనిపించింది. అత్తింటివారే అదనపు కట్నం కోసం వేధించి.. ఆత్మహత్య చేసుకునేలా చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా.. ట్విషాకు డ్రగ్స్ అలవాటు ఉందని అత్తింటి కుటుంబం వాదిస్తోంది. పోస్టుమార్టంలో ఆత్మహత్యేనని తేలినప్పటికీ.. ఇందులో ఏదో కుట్ర ఉన్నట్లుగా ట్విషా పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తూ.. మరోసారి పోస్టుమార్టం చేసేందుకు డిమాండ్ చేశారు. ఇందుకు కోర్టు అంగీకరించగా.. అలా చేస్తే వైద్యుల్ని అవమానించినట్లేనని ట్విషా అత్తింటి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.






