ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: కోర్టులో మనీష్ సిసోడియా బిగ్ షాక్!

by Disha Web Desk 2 |
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: కోర్టులో మనీష్ సిసోడియా బిగ్ షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు షాక్ తగిలింది. సిసోడియాకు కోర్టు 5 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. రేపటి నుంచి మార్చి 4 వరకు సీబీఐ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆదివారం సిసోడియాను విచారణకు పిలిపించిన సీబీఐ అధికారులు అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో సిసోడియా పాత్ర కీలకమైనదని, ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని అందువల్ల ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది.

అయితే సిసోడియా తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ విచారణకు సహకరిస్తున్నామని అయినా అక్రమంగా అరెస్ట్ చేశారని వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. మనీష్ సిసోడియాకు ఐదురోజుల సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటు చేసుకోగా ఈ అనూహ్య పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Next Story

Most Viewed