Shiva kumar: మేము కుర్చీ కోసం కొట్లాడుతూనే ఉన్నాం.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

కర్ణాటక రాజకీయాల్లో సీఎం పదవి విషయంపై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే.

Shiva kumar: మేము కుర్చీ కోసం కొట్లాడుతూనే ఉన్నాం.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాజకీయాల్లో సీఎం పదవి విషయంపై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. డీకే శివకుమార్ (Dk shiva kumar) సీఎం కాబోతున్నారంటూ ఆయన మద్దతు దారులు వ్యాఖ్యానిస్తుండగా, ఐదేళ్లు నేనే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య (Siddaramaiah) చెబుతున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు అడ్వకేట్స్ అసోసియేషన్ నిర్వహించిన కెంపెగౌడ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న డీకే అక్కడ మాట్లాడుతుండగా కుర్చీలు ఖాళీగా ఉన్నప్పటికీ న్యాయవాదులు నిలబడే ఉన్నారు. దీనిపై డీకే స్పందిస్తూ.. ‘మేము కుర్చీ కోసం పోరాడుతున్నాం. కానీ మీరు కుర్చీ వద్దని దూరంగా ఉన్నారు. కుర్చీ దొరకడం అంత సులభం కాదు. అవకాశం వచ్చినప్పుడే కూర్చోవాలి. కానీ మీరంతా త్యాగం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ అద్బుతమైన కుర్చీలున్నాయి. వాటిలో కూర్చోండి’ అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. న్యాయవాదులంతా బిగ్గరగా నవ్వారు. కానీ డీకే మాత్రం సరదాగా నవ్వుతూనే తన ఆవేదనను వెల్లడించారని పలువురు భావిస్తు్న్నారు.

Next Story