Rajasthan: రాజస్థాన్‌లో భానుడి ఉగ్రరూపం

by Shamantha N |

రాజస్థాన్‌లో భానుడు తన ప్రకోపాన్ని చూపుతున్నాడు. బర్మేర్, జైసల్మేర్ లో సూర్యుడు ఉగ్రరూపంలో కన్పిస్తున్నాడు. కాగా.. రాజస్థాన్ లో మరో మూడ్రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Rajasthan: రాజస్థాన్‌లో భానుడి ఉగ్రరూపం
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లో భానుడు తన ప్రకోపాన్ని చూపుతున్నాడు. బర్మేర్, జైసల్మేర్ లో సూర్యుడు ఉగ్రరూపంలో కన్పిస్తున్నాడు. కాగా.. రాజస్థాన్ లో మరో మూడ్రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. బర్మేర్ లో ఆదివారం అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత, జైసల్మేర్ లో గరిష్ఠంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా.. బర్మేర్ లో సీజనల్ సగటు కన్నా 6.8 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైనట్లు వాతవారణ శాఖ వెల్లడించింది. 1998 నుండి బర్మేర్‌లో ఏప్రిల్ మొదటి వారంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఏప్రిల్ 3న 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ జైపూర్ డైరెక్టర్ ఆర్.ఎస్. శర్మ అన్నారు. పగటిపూట వేడి తీవ్రంగా ఉంటుందని.. అంతేకాకుండా రాత్రిపూట కూడా అసాధారణంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొన్నరు. బర్మేర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందిరు. ఇది సగటు కంటే 6.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ.

21 నగరాల్లో 40 డిగ్రీల కంటే..

అంతేకాకుండా, రాజస్థాన్ లోని మొత్తం 21 నగరాల్లో 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన వేడి కారణంగా పలు నగరాల్లో మధ్యాహ్న సమయంలో ప్రజల రాకపోకలు తగ్గాయి. ఏప్రిల్ 9 వరకు కోట, జోధ్‌పూర్, జైపూర్, ఉదయపూర్, బికనీర్ ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 11-13 వరకు రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని సూచించింది.

Next Story