- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ ఉగ్రవాది అరెస్టులో సంచలన విషయాలు వెలుగులోకి
పక్కా సమాచారంతో గుజరాత్ ఏటీఎస్ హైదరాబాద్‌లో ఉగ్రవాది డా. సయ్యద్ మొయినుద్దీన్ అరెస్టు చేసిన విషయం తెలసిందే.

దిశ, వెబ్ డెస్క్: పక్కా సమాచారంతో గుజరాత్ ఏటీఎస్ హైదరాబాద్‌లో ఉగ్రవాది డా. సయ్యద్ మొయినుద్దీన్ అరెస్టు చేసిన విషయం తెలసిందే. ఈ ఉగ్రకుట్రలో అతనిపతో పాటు మరో ముగ్గురిని ఏటీఎస్ అరెస్ట్ చేసి విచారణ చేసింది. దీంతో వారి విచారణలో తాజాగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాజేంద్రనగర్‌లో మొయినుద్దీన్ నివాసంలో పెద్దఎత్తన రెసిన్ (Resin poisonous) అనే విషం లభ్యం అయింది. దీనిపై ఆరాతీయగా భారీ మొత్తంలో విష ప్రయోగం చేసి ప్రజలను చంపాలని ఉగ్రకుట్ర ప్లాన్ చేశారు. ఈ రెసిన్ విషాన్ని సయ్యద్ మొయినుద్దీన్ తన నివాసంలో పెద్దఎత్తున తయారు చేస్తున్నాడు. ముఖ్యంగా దేవాలయాలు, వాటర్ ట్యాంక్‌లో రెసిన్ కలిపి సామూహిక విష ప్రయోగం చేయాలని ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు.
ఈ రెసిన్ విషం ఎమిటి..?
ఈ రెసిన్ విషం పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాలలో ఇది ఒకటి తెలుస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. రుచి లేదు, వాసన ఉండదు. మీ గ్లాసు నీటిలో కలిపినా, మీరు కలలో కూడా అనుమానించలేరు. అయితే MBBS చదివిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ ఈ రెసిన్ విషంపై అనేక ప్రయోగాలు చేశాడు. తన వైద్య పరిజ్ఞానాన్ని మనుషులను బతికించడానికి కాకుండా.. వేల మందిని చంపడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సులభంగా దొరికే ఆముదం గింజల నుండి రిసిన్‌ను ఎలా సేకరించాలో, దానిని ఎలా శుద్ధి చేయాలో ట్రైన్ అయ్యాడు. తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కాలంగా ఆముదం గింజల నుండి రిసిన్‌ను తీశాడు. దీనిని డ్రోన్ల సహాయంతో తన సహచరులకు పంపించేదుకు ప్రణాలికలు చేసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు.






