- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జపాన్ లో బద్దలైన అగ్నిపర్వతం.. నాలుగున్నర కిమీల ఎత్తుకు ఎగిరిన బూడిద
by Muthe.Rajitha |
జపాన్‌లోని క్యూషూ ద్వీపంపై ఉన్న సకురాజీమా అగ్నిపర్వతం నేడు బద్దలైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : జపాన్‌లోని క్యూషూ ద్వీపంపై ఉన్న సకురాజీమా అగ్నిపర్వతం నేడు బద్దలైంది. దీంతో భారీగా ధూళి, దుమ్ము మేఘాలు, రాళ్లు 4,400 మీటర్ల ఎత్తుకు ఎగసి పడ్డాయి. ఇది గత సంవత్సరం కాలంలో ఇంత ఎత్తుకు అగ్నిపర్వతం ఎగసి పడటం ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు. 12:57 గంటల నుంచి పలుమార్లు అగ్ని పర్వతం విస్ఫోటనం చెందటంతో కాగాషిమా, మియాజాకి, కుమామోటో ప్రాంతాల్లో మూడవ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. కాగాషిమా ఎయిర్‌పోర్ట్‌లో 30కి పైగా ఫ్లైట్లు రద్దయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా జపాన్ లో చాలా యాక్టివ్ గా ఉన్న అగ్నిపర్వతాల్లో సకురాజీమా ఒకటి. 2019లో ఇది బద్దలైనపడు దీని దుమ్ము, దూళి, రాళ్లు 5.5 కిమీల ఎత్తుకు ఎగిరిపడ్డాయి.
Next Story






