బిహార్ ఇండియా కూటమిలో కుదిరిన పొత్తు.. ఎవరికి ఎన్ని సీట్లంటే?

by Dishanational6 |
బిహార్ ఇండియా కూటమిలో కుదిరిన పొత్తు.. ఎవరికి ఎన్ని సీట్లంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎట్టకేలకు బిహార్ లో ఇండియా కూటమిలో పొత్తు కుదిరింది. సీట్ల షేరింగ్ ఫైనల్ అయ్యింది. పొత్తులో భాగంగా ఆర్జేడీకి 26 సీట్లలో, కాంగ్రెస్ 9 సీట్లలో, వామపక్షాలు 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని కూటమి పార్టీలు తెలిపాయి.

కతిహార్, కిషన్‌గంజ్, పాట్నా సాహిబ్, ససారం, భగల్‌పూర్, పశ్చిమ చంపారన్, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, మహారాజ్‌గంజ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. బెగుసరాయ్, ఖగారియా, ఆర్హ్, కరకత్, నలంద నుంచి వామపక్షాలు పోటీ చేయనున్నాయి. మిగతా 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీకి దిగనుంది.అటు ఎన్డీఏ కూటమిలో బీజేపీ 17 సీట్లు, జేడీయూ 16, జితన్‌ రామ్‌ మాంజీ పార్టీ హెచ్‌ఏఎమ్‌ ఒక సీటు, ఆర్‌ఎల్‌ఎస్పీ ఒక సీటు, చిరాగ్‌ పాశ్వాన్‌ లోక్‌జనశక్తి పార్టీ 5 సీట్లలో పోటీ చేయనున్నాయి.

ఇకపోతే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఆర్జేడీ, వామపక్షాలు ఒక్కసీటుని కూడా గెలుచుకోలేకపోయాయి. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ 17, జనతాదళ్ (యునైటెడ్) 16 స్థానాలు గెలుచుకున్నాయి. ఇకపోతే, బిహార్‌లో మొత్తం 40 సీట్లకు గాను ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుండగా జూన్‌ 1న ఏడవ విడత పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు జూన్‌ 4న వెలువడనున్నాయి.


Next Story

Most Viewed