కళ్లు జిగేల్ అనిపించేలా గణతంత్ర దినోత్సవ వేడుకలు

by Web Desk |
కళ్లు జిగేల్ అనిపించేలా గణతంత్ర దినోత్సవ వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జ‌న‌వ‌రి 29న ఢిల్లీలో జరిగే బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో భాగంగా 1000 డ్రోన్లతో ప్రదర్శనను నిర్వహించనున్నారు. ఈ డ్రోన్ ప్రదర్శన 10 నిమిషాల పాటు జరగనుంది. అంతేకాకుండా రాత్రి ఆకాశంలో ప్రభుత్వ విజయాల ప్రదర్శన కూడా ఉంటుంది. బాట్లాబ్ సంస్థ, రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి ఈ ఏడాది జరగబోయే 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని పురస్కరించుకుని 'డ్రోన్ షో'ను రూపొందించింది.

భారతదేశంలో డ్రోన్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిందని సైన్స్ & టెక్నాలజీ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. చైనా, రష్యా, యూకే తర్వాత 1000 డ్రోన్లతో ఇంత భారీ ప్రదర్శన నిర్వహిస్తున్న 4వ దేశంగా భారత్ అవతరించనుందని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రాజెక్టు దేశీయంగానే అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో ఫ్లైట్ కంట్రోలర్ వంటి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండూ ఉన్నాయి. ఖచ్చితమైన GPS, మోటార్ కంట్రోలర్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ (GCS) అల్గోరిథంలు మొదలైనవి ఇందులో ఉన్నాయి.



Next Story

Most Viewed