రూ.1.87 లక్షల కోట్ల రికార్డ్ జీఎస్టీ వసూళ్లు

by Disha Web Desk 1 |
రూ.1.87 లక్షల కోట్ల రికార్డ్ జీఎస్టీ వసూళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్‌లో GST వసూళ్లు 12 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది పరోక్ష పన్ను విధానం అమలులోకి వచ్చిన తర్వాత అత్యధిక నెలవారీ మాప్ అప్. ఏప్రిల్ 2023 నెలలో సేకరించిన స్థూల GST ఆదాయం రూ.1,87,035 కోట్లు ఉండగా అందులో CGST రూ.38,440 కోట్లు, SGST రూ. 47,412 కోట్లు, IGST రూ.89,158 కోట్లు (రూ. 34,972 కోట్లతో సహా వస్తువుల దిగుమతిపై వసూళ్లు) రూ.12,025 కోట్లు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో అత్యధికంగా రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు గతేడాది ఏప్రిల్‌లో నమోదయ్యాయి.

ఏప్రిల్ 2023 నెల ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో జీఎస్టీ ఆదాయం కంటే 12 శాతం ఎక్కువేనని అని మంత్రిత్వ శాఖ తెలిపింది. నెలలో, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుంచి వచ్చిన ఆదాయాల కంటే 16 శాతం ఎక్కువే కావడం విశేషం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం స్థూల వసూళ్లు రూ.18.10 లక్షల కోట్లు కాగా, ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 22 శాతం ఎక్కువే.


Next Story

Most Viewed