రూ.2000 నోట్ల రద్దు చేస్తూ RBI సంచలన ప్రకటన

by GSrikanth |   ( Updated:2023-10-10 16:55:27.0  )
రూ.2000 నోట్ల రద్దు చేస్తూ RBI సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ రిజర్వు బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజు(మే 19) నుంచి రూ.2 వేల నోటు జారీ నిలిపివేస్టున్నట్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఈ నోట్లను సర్క్యులేషన్‌లో ఉంచొద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది. ఎవరివద్దనైనా ఈ నోట్లు కలిగి ఉన్న వారు మే 23 నుంచి అన్ని బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ బ్రాంచ్‌లో మార్చుకోవచ్చని సూచించింది. సెప్టెంబర్ 30 వరకు ఎక్స్ ఛేంజ్, డిపాజిట్లకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఒక రోజులో ఒక వ్యక్తి రూ.20 వేలు మాత్రమే నోట్లను మార్చుకోవడానికి వీలుంటుందని తెలిపింది.

ఎన్నికల ఏడాదిలో ఆర్బీఐ రూ.2 వేల నోట్ల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే మోడీ ప్రభుత్వం డిమానిటైజేషన్ చేసిన తర్వాత 2016 నుంచి మార్కెట్లో చెలామణిలో ఉంది. ఈ నోటు చెలామణిపై మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇటీవల ఈ నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ క్రమంలో 2 వేల నోట్లను వెనక్కి తీసుకోవాలని తాజాగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో బ్లాక్ మనీ విషయం మరోసారి తెరపైకి వస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రూ.2 వేల నోట్లను దాచిపెట్టుకున్న వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Read More:

Breaking: రూ.2 వేల నోట్ల రద్దుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story