రాహుల్- ఉద్ధవ్ ఠాక్రేల మధ్య గంట సేపు సంభాషణ, సీట్ల పంపకాలపై చర్చలు

by Dishanational6 |
రాహుల్- ఉద్ధవ్ ఠాక్రేల మధ్య గంట సేపు సంభాషణ, సీట్ల పంపకాలపై చర్చలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమి మిత్రపక్షాలతో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని 48 సీట్ల గురించి కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య సీట్ల షేరింగ్ పై చర్చలు జరిగాయి. ఉద్ధవ్ కు జోడో న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. దాదాపు గంటసేపు ఇరువురు నేతలు సంభాషించుకున్నట్లు సమాచారం.

ముంబయి సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ వెస్ట్‌ల్లో మూడింటిలో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్ సెంట్రల్‌తో సహా మహారాష్ట్రలోని 18 లోక్‌సభ స్థానాలకు ఉద్ధవ్ ఠాక్రే పోటీ చేయాలనుకుంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

2019లో లోక్ సభ ఎన్నికల కోసం ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ ల మహా వికాస్ అఘాడీ కోసం సీట్ల చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. అదే ఏడాది ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం మొత్తం 40 స్థానాల్లో పోటీ చేయగా.. 22 స్థానాల్లో గెలుపొందింది. మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు అశోక్ చవాన్, మిలింద్ దేవ్రా బీజేపీలోకి వలస వెళ్లారు. ఈ ఫిరాయింపులు మహారాష్ట్ర ప్రతిపక్ష మిత్రపక్షాలకు సీట్ల చర్చలను క్లిష్టతరం చేశాయి. మరోవైపు కాంగ్రెస్ ఫిరాయింపుల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ముంబై సీట్లలో ఎక్కువ వాటాను కోరుతున్నట్లు సమాచారం.

ప్రతిపక్షాల మనుగడ కోసం ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed