- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Priyanka: నిజమైన భారతీయులెవరో సుప్రీంకోర్టు నిర్ణయించలేదు.. ప్రియాంకా గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై ప్రియాంక గాంధీ స్పందించారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత సైన్యంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ (Priyanka gandhi) స్పందించారు. నిజమైన భారతీయులెవరో సుప్రీంకోర్టు నిర్ణయించలేదన్నారు. ఆ విషయం న్యాయమూర్తుల పరిధిలోకి రాదని తెలిపారు. బుధవారం ఆమె పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రాహుల్ కు సైన్యం పట్ల గౌరవం ఉందని, ఏనాడూ ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా, ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం రాహుల్ గాంధీ విధి అని తెలిపారు. రాహుల్ మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పారు.న్యాయమూర్తుల పట్ల గౌరవం ఉందని కానీ నిజమైన భారతీయులెవరో వారు గుర్తించలేరని తెలిపారు. కాగా, భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యంపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు కాగా దీనిపై విచారించిన సుప్రీంకోర్టు రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.






