పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని భూటాన్ టూర్!

by Disha Web Desk 14 |
పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని భూటాన్ టూర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. భూటాన్ రాజధాని థింపులో భూటాన్ సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాను భారత్ భూటాన్‌ల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలకు హాజరవుతానని పేర్కొన్నారు. తాను భూటాన్ అత్యున్నత పురస్కారం‘ డ్రూక్ గ్యాల్పో’, ప్రధానితో చర్చల కోసం ఎదురుచుస్తున్నాని తెలిపారు. అయితే వాస్తవానికి నిన్ననే ఆయన భూటాన్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ అనివార్యకారణాలతో ఒక రోజు జాప్యం అయ్యింది.

కాగా, భూటాన్ పర్యటనలో భాగంగా ఇంధన వినియోగం, ఆహార సురక్షిత ప్రమాణాలపై ఒప్పందాలు జరగనున్నాయి. థింపులో భారత నిధులతో నిర్మించిన ఆస్పత్రిని ప్రధాని ప్రారంభించనున్నారు. ఆ దేశ 13వ పంచవర్ష ప్రణాళిక, వివిధ రంగాల్లో భారత్ అందించాల్సిన సాయంపై ఈ సందర్భంగా ప్రధాని చర్చలు జరుపనున్నారు. కాగా, పార్లమెంటు ఎన్నికలు, సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరెస్టుల వేళ ప్రధాని మోడీ భూటాన్ పర్యటన చేపట్టడం చర్చానీయాంశంగా మారింది.


Next Story

Most Viewed