Political parties: మరో 476 రాజకీయ పార్టీల రద్దు.. చర్యలు ప్రారంభించిన ఈసీ

by B.Srinivas |

దేశ వ్యాప్తంగా మరో 476 రాజకీయ పార్టీలను రద్దు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రారంభించింది.

Political parties: మరో 476 రాజకీయ పార్టీల రద్దు.. చర్యలు ప్రారంభించిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా మరో 476 రాజకీయ పార్టీలను రద్దు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ (Election commission) చర్యలు ప్రారంభించింది. ఈ జాబితాలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పలు పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలు గత ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయలేదని, అవసరమైన చట్టపరమైన రూల్స్ పాటించడంలో విఫలమయ్యాయని ఈసీ సోమవారం తెలిపింది. ఎన్నికల అధికారులు ఈ పార్టీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి విచారించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ లిస్టులో ఉత్తరప్రదేశ్ నుంచి 121, మహారాష్ట్రలోని 44, తమిళనాడులో 42, ఢిల్లీలోని 41 పార్టీలు సహా ఇతర పొలిటికల్ పార్టీలున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంద్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 9 పార్టీలు రద్దు చేయనున్నట్టు ఈసీ తెలిపింది. కాగా, ఈ నెల 9న ఈసీ గుర్తింపులేని 334 పార్టీలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Next Story