మార్చి 1 విడుదల.. ప్రపంచంలోనే తొలి వేదిక్ గడియారం రెడీ

by Dishanational4 |
మార్చి 1 విడుదల.. ప్రపంచంలోనే తొలి వేదిక్ గడియారం రెడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : అది సాధారణ గడియారం కాదు.. ప్రాచీన భారతీయ పంచాంగం ప్రకారం సమయాన్ని చూపించే స్పెషల్ గడియారం. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి వేదిక్ గడియారాన్ని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మార్చి 1న ప్రారంభిస్తారు. ఉజ్జయిని నగరంలోని జంతర్ మంతర్ వద్ద నిర్మించిన 85 అడుగుల ఎత్తైన టవర్‌పై వేదిక్ గడియారాన్ని ఏర్పాటు చేశారు. ఈ గడియారం వేద పంచాంగం, గ్రహాల స్థానాలు, ముహూర్తం, జ్యోతిష్య గణనల సమాచారాన్ని కూడా ప్రదర్శిస్తుంది. ఇది భారతీయ ప్రామాణిక సమయం (ఐఎస్‌టీ), గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) సమయాన్ని కూడా చూపిస్తుంది. ఈ గడియారం ఒక సూర్యోదయం నుంచి మరొక సూర్యోదయం వరకు సమయాన్ని కంటిన్యూగా గణిస్తుంది. రెండు సూర్యోదయాల మధ్య ఒక గంట 48 నిమిషాల నిడివితో కూడిన 30 సమయ భాగాలు ఉంటాయని అంటారు. ‘‘ఉజ్జయిని నగరాన్ని కాల గణనకు కేంద్రంగా పరిగణిస్తుంటారు. అందుకే ఇక్కడ వేద గడియారాన్ని ఏర్పాటు చేశారు. కర్కాటక రాశిచక్రం ఉజ్జయిని నగరం మీదుగానే వెళ్తుంటుంది’’ అని మహారాజా విక్రమాదిత్య రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీ రామ్ తివారీ తెలిపారు. 300 సంవత్సరాల క్రితం ప్రపంచంలోని ప్రామాణిక సమయాన్ని ఉజ్జయిని కేంద్రంగానే నిర్ణయించారని నిపుణులు అంటున్నారు. సమయాన్ని కచ్చితత్వంతో తెలుసుకోవడానికి ఉజ్జయినిలో ఒక యంత్రం ఉంది.

Next Story

Most Viewed