- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pm modi: చోళ సామ్రాజ్యం ప్రజాస్వామ్యానికి స్వర్ణయుగం.. ప్రధాని మోడీ ప్రశంసలు
తన సార్వభౌమాధికారంపై దాడి జరిగితే భారత్ ఎలా స్పందిస్తుందో ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిందని ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: తన సార్వభౌమాధికారంపై దాడి జరిగితే భారత్ ఎలా స్పందిస్తుందో ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిందని ప్రధాన నరేంద్ర మోడీ (Narendra modi) అన్నారు. ఈ ఆపరేషన్ దేశ వ్యాప్తంగా ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ 1 జయంతి సందర్భంగా తిరుచిరాపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులకు ఎక్కడా సురక్షితమైన ప్రదేశం ఉండబోదని ఆపరేషన్ సిందూర్ తో స్పష్టంగా అర్ధమైందని తెలిపారు. ఇటీవల ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడిని దేశ వ్యాప్తంగా ప్రశంసిస్తున్నారన్నారు. రాజ రాజ చోళ చక్రవర్తులు, ఆయన కుమారుడు రాజేంద్ర చోళ-I పేర్లు భారతదేశ గుర్తింపు, గర్వానికి పర్యాయపదాలు అని చెప్పారు. తమిళనాడులో ఇద్దరికీ గొప్ప విగ్రహాలు నిర్మిస్తామని, ఇవి మన చారిత్రక వారస్తానికి ఆధునిక స్తంభాలుగా నిలుస్తాయన్నారు.
చోళ సామ్రాజ్యంపైనా ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ‘చోళ సామ్రాజ్యం భారతదేశ స్వర్ణ యుగాలలో ఒకటి అని చరిత్రకారులు నమ్ముతారు. చరిత్రకారులు ప్రజాస్వామ్యం పేరుతో బ్రిటన్ మాగ్నా కార్టా గురించి మాట్లాడుతారు. కానీ చాలా శతాబ్దాల క్రితం చోళ సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఎన్నికలు జరిగాయి. ఇతర ప్రదేశాలను జయించిన తర్వాత బంగారం, వెండి లేదా పశువులను తీసుకువచ్చే అనేక మంది రాజుల గురించి మనం విన్నాం’ అని వ్యాఖ్యానించారు. చోళ రాజులు శ్రీలంక, మాల్దీవులు ఆగ్నేయాసియాతో దౌత్య సంబంధాలను పెంపొందించుకున్నారని గుర్తు చేశారు.
చోళ I గౌరవార్థం స్మారక నాణెం విడుదల
ప్రధాని మోడీ తమిళనాడులో చారిత్రాత్మక చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ I గౌరవార్థం ప్రత్యేక స్మారక నాణెం విడుదల చేశారు. చక్రవర్తి గొప్ప సహకారాన్ని, భారతదేశ అద్భుతమైన చరిత్రను గౌరవించే లక్ష్యంతో ఈ నాణెం విడుదల చేసినట్టు తెలిపారు. చోళ రాజులకు సంబంధించిన ఘటనలు తనకు చురుగ్గా పనిచేయడానికి శక్తినిస్తాయన్నారు. మాల్దీవుల నుంచి తిరిగొచ్చి నేరుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు.






