- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pete Hegseth: ఆ దాడితోనే యుద్ధం ముగిసింది.. యూఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్
ఇరాన్‌లోని మూడు కీలకమైన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతోనే యుద్ధం ముగిసిందని పీట్ హెగ్సేత్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ ఇజ్రాయెల్ (Iran Israel) వివాదంలో భాగంగా ఇరాన్‌లోని మూడు కీలకమైన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతోనే యుద్ధం ముగిసిందని యూఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ (Pete Hegseth) అన్నారు. 30,000 పౌండ్ల పేలుడు పదార్థాలు, మందు గుండు సామగ్రితో దాడి చేశామని దీంతో ఫోర్డో అణు కేంద్రం ధ్వంసమైందని తెలిపారు. ఈ పరిణామమే కాల్పుల విరమణకు దారి తీసిందని నొక్కి చెప్పారు. మరోవైపు అణు కేంద్రాలపై దాడులే యుద్ధాన్ని సమర్థవంతంగా ముగించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సైతం నొక్కి చెప్పారు.
‘నేను హిరోషిమా, నాగసాకిల ఉదాహరణను ఇవ్వాలనుకోవడం లేదు, కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ముగించినది ప్రాథమికంగా ఇదే. దీనికి పరిష్కారం చూపకపోతే ఇంకా ఘర్షణ జరిగేది’ అని తెలిపారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల కారణంగా 12 రోజుల ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందని చెప్పారు. కాగా, నటాంజ్, పోర్డో, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై యూఎస్ బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి జరిగిన మరుసటి రోజే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.






