వార్షిక బడ్జెట్‌‌పై జనం కోటి ఆశలు.. కాసేపట్లో ఆర్థిక రంగ నిపుణులతో ప్రధాని భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-30 06:04:04  IST  )

2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేటు, సంస్కరణలు, ఉపాధి సృష్టి, ఎగుమతులు పెంచడం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించబోతున్నారు.

వార్షిక బడ్జెట్‌‌పై జనం కోటి ఆశలు.. కాసేపట్లో ఆర్థిక రంగ నిపుణులతో ప్రధాని భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఇవాళ ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేటు, సంస్కరణలు, ఉపాధి సృష్టి, ఎగుమతులు పెంచడం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman), నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బెరీ (Suman Beri), నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొననున్నారు. ఈ చర్చలు బడ్జెట్‌లో ప్రాధాన్యతలు, సూచనలు నిర్ణయించడంలో కీలక పాత్రను పోషించనున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సమావేశంలో ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ భారత్ (Self-Reliant India) లక్ష్య సాధన, 2047 నాటికి వికసిత్ భారత్ అవతరణకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యూహాలపై దృష్టి సారించేందుకు చేపట్టాల్సి విధివిధానాలపై డిస్కస్ చేయనున్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అగ్ర రాజ్యం అమెరికా నుంచి భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్ విధించిన నేపథ్యంలో ఆర్థిక రంగ నిపుణులతో నేటి భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వ్యాపార సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, వివిధ రంగాల ప్రతినిధులతో పలు ప్రీ-బడ్జెట్‌పై సంప్రదింపులు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, 2026 ఫిబ్రవరి 1న లేదా ఆ మరునాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ (Lok Sabha)లో 2026-27 యూనియన్ బడ్జెట్‌లను ప్రవేశపెట్టనున్నారు. 2017 నుంచి ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, ఈ సారి బడ్జెట్‌లో మధ్యతరగతి, రైతులు, యువత, మహిళలు, MSMEలు, వ్యవసాయం, తయారీ రంగాలు, ఉపాధి సృష్టి, ఎగుమతుల ప్రోత్సాహం వంటి అంశాలపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story